ఓరుగల్లును పాలించిన కాకతీయుల అద్భుత శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక రామప్ప దేవాలయం:నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్

ఓరుగల్లును పాలించిన కాకతీయుల అద్భుత శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక రామప్ప దేవాలయమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు.

బుధవారం రోజున కేంద్ర నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్న వీరికి దేవస్థానం తరఫున సాంప్రదాయబద్దంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రామప్ప శిల్ప కళా విశిష్టతను రామప్ప గైడ్ విజయ్ ను అడిగి తెలుసుకున్నారు.
దేవస్థానం అధికారులు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో నీతి అయోగ్ సభ్యులకు మెమొంటోలు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా , భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు, ములుగు అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, భూపాలపల్లి అదనపు కలెక్టర్ దివాకర, సంబంధిత రెండు జిల్లాల అధికారులు పాల్గొన్నారు

Share This Post