ఔత్సాహికులు పరిశ్రమల నెలకొల్పన కు ముందుకు రావాలి…కలెక్టర్ హరీష్

ఔత్సాహికులు పరిశ్రమల నెలకొల్పన కు ముందుకు రావాలి…కలెక్టర్ హరీష్

జిల్లాలో ఆహార శుద్ధి, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ఎన్నో అవకాశాలున్నాయని, ఔత్త్సాహిక పారిశ్రామిక వేత్తలు కంపెనీలు నెలకొల్పుటకు ముందుకు రావలసిందిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమల నెలకొల్పనకు టి.ఎస్. ఐ-పాస్ క్రింద గత 6,7 సంవత్సరాల నుండి సులువుగా అనుమతులు , రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నదని ఈ అవకాశాలను అందిపుచ్చుకొని ఎగుమతులు చేసే దిశగా పరిశ్రమలు నెలకొల్పాలని కోరారు. ఆజాది కా అమ్రిత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 20 నుండి 26 వరకు వాణిజ్య సప్తాహ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని అన్నారు. అందులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఎక్స్పోర్ట్ కంపనీలు, అనుబంధ శాఖల తో ఏర్పాటు చేసిన ఎగుమతుల సమ్మేళనం కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లాకు మూడు జాతీయ రహదారులు, రైలు సౌకర్యంతో పాటు హైదరాబాద్ సమీపంలో ఉన్నందున ఎగుమతులకు ఎన్నో అవకాశాలున్నాయని పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాలను అందిపుచ్చుకొని మార్కెట్ లో డిమాండ్, సప్లయి కి అనుగుణంగా ఎగుమతులు చేసే ఉత్పత్తులను గుర్తించి పరిశ్రమల నెలకొల్పనకు ముందుకు రావాలని, జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహాకారాలు అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పరిశ్రమల నెలకొల్పన, ఎగుమతులు చేయటంలో ఇబ్బందులు, సమస్యలుంటే తగు సలహాలు, సూచనలిస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని సమావేశానికి హాజరైన (8) పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. అనంతరం వివిధ పరిశ్రమలు ఏర్పాటుచేసిన ఉత్పత్తులను పరిశీలించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కృష్ణ మూర్తి, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ వేణుగోపాల్ రావు, ఏ.డి. మైన్స్ జయరాజ్, జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్ నాయక్, మత్స్య శాఖా ఏ.డి. మల్లేశం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్ రావు, టి.ఎస్. ఐ.ఐ.సి. ఈఓ., వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Post