కంటి వెలుగుతో ప్రజల జీవిత్తాల్లో కొత్త కాంతులు

ప్రత్యేక కధనం/ప్రచురణార్థం


కంటి వెలుగుతో ప్రజల జీవిత్తాల్లో కొత్త కాంతులు

భూపాలపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 20261 మందికి కంటి పరీక్షల నిర్వహణ

5403 మందికి రీడింగ్ గ్లాసెస్, 3911 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఆర్డర్

ఉచిత పరీక్షలతో ప్రజలకు తప్పుతున్న కంటి , ఆర్ధిక ఇబ్బందులు

జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ లో పక్కాగా జరుగుతున్న కంటి వెలుగు శిబిరాలు
———————————————————
జయశంకర్ భూపాలపల్లి జనవరి 29
———————————————————–
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రజల జీవితాలలో కొత్త కాంతులు వస్తున్నాయి. కంటి సమస్యలతో బాధపడే వారి ఇబ్బందులు తొలగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు శిబిరాలు జిల్లాలో కలకలలాడుతున్నాయి.

కంటి పరీక్షలు చేయించుకునేందుకు నగరాలు పట్టణాలకు వెళ్లే అవసరం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో జనావాసాల వద్దనే కంటి వెలుగు శిబిరాలు నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు క్యాంపులకు యువతీ యువకుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభింస్తున్నది. అన్ని వయసుల వారు కంటిలు క్యాంపులకు ఉత్సాహంగా వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.

కంటి వెలుగు క్యాంపుల నిర్వహణలో ప్రజాప్రతినిధులు, అధికారులు చురుకైన పాత్ర వహిస్తూ క్యాంపుల విజయవంతానికి కృషి చేస్తున్నారు. ప్రజలు కంటి వెలుగు క్యాంపు ల వద్ద సకాలంలో చేరుకునే విధంగా పక్కా ప్రణాలికలు రూపొందించి వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది.కంటి పరీక్షల నిర్వహణలో వచ్చే ఖర్చుకు భయపడో, అవగాహన లేకో పరీక్షలు చేయించుకొని వారికి కంటి వెలుగు కార్యక్రమం ఒక వరంలా మారింది, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు అందించడంతో ప్రజలు సంబరపడుతున్నారు.

జనవరి 19న జిల్లాలో కంటి వెలుగు శిబిరాలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 20621 మంది ప్రజలకు 25 వైద్య బృందాలతో కంటి పరీక్షలు నిర్వహించి 5403 మంది ప్రజలకు రీడింగ్ గ్లాసెస్ అందించి 3911 మంది ప్రజలకు ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఆర్డర్ ఇవ్వడం జరిగింది.

కంటి వెలుగు క్యాంపుల పై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కలెక్టర్ భవిష్ మిశ్రా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు.

జిల్లాలో 25 వైద్య బృందాలతో క్యాంపులను ఏర్పాటు చేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. కంటి వెలుగు క్యాంపులో వద్ద ప్రజలు అధిక సమయం వేచి చూడాల్సిన అవసరం లేకుండా, గ్రామంలోని పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు, రేషన్ డీలర్లు ఇతర అధికారులతో బృందాలను ఏర్పాటు చేసి క్యాంపులకు రావాల్సిన సమయాన్ని సూచిస్తూ ఇంటి వద్దకు ఆహ్వాన పత్రికలను పంపిణీ చేయడం జరుగుతుంది.

రాష్ట్ర అధికారుల సూచనల మేరకు జిల్లాలో ఉన్న బఫర్ బృందాలతో ఉద్యోగులకు ,జర్నలిస్టులకు, పోలీసులకు న్యాయవాదులకు వివిధ వర్గాల వారికి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయుటకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది.

కంటివెలుగు కార్యక్రమములో పరిక్ష చేసుకున్న వారి మాటల్లో

గుగులోతు సంతారి కాటారం మండలం
కంటి చూపు మస్తు కనబడుతుంది
ఇన్నాళ్ల సంధి పైసలు లేక ఎక్కడికో పోయి కంటి పరీక్షలు చేయించుకోవాలని పోలేదు చూపు సరిగా కనపడక చాలా బాధ పడిన మాలాంటి పేదోళ్లకు పెద్దకొడు కై సీఎం కేసీఆర్ సారు కంటి పరీక్షలు చేస్తున్నారు అందుకే ఈడికి వచ్చి నా కండ్ల పరీక్ష చేయించుకుంటే కండ్లద్దాలు ఇచ్చినారు మందులు కూడా ఇచ్చిండ్రు ఒక్క పైసా కూడా తీసుకోలే ఇప్పుడు నా సూపు చాలా మంచిగా కనబడుతుంది దేవుని లాంటి సీఎం సారు చల్లగా ఉండాలి ….

గౌరిశెట్టి రాజయ్య, ఒడితల (చిట్యాల)
ఖర్సులు తప్పినై..
కొన్ని రోజుల కింద నజర్ తగ్గిందని ప్రైవేట్ దబఖానకు పోతే మస్తు పైసలు అయినై, పట్నం పోయి… లైన్లో నిలబడి చూపెట్టుకొని వచ్చేసరికి ప్రాణం పోయినంత పనైంది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. మా ఊర్లోనే క్యాంపు పెట్టిల్లు. డాక్టర్లు కండ్లకు పరీచ్చ చేసి మందులు, అద్దాలు ఇస్తాండ్రు. సీఎం కేసీఆర్ సార్ దయతో నయా పైసా ఖర్చు లేకుండా పరీక్ష చేయించుకున్న నాలాంటి పేదోళ్లకు ఎంతో మేలై తాంది…..

 

———————————————————————————
వి.శ్రీధర్, జిల్లా పౌర సంబంధాల అధికారి,(పూ.అ.భా) జయశంకర్ భూపాలపల్లి చే జారీ

Share This Post