కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శం, పేద ప్రజలకు ఒక వరం లాంటిది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి వెలుగుల కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ప్రెస్ రిలీజ్

జనగామ జిల్లా,  జనవరి 19

కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శం, పేద ప్రజలకు ఒక వరం లాంటిది

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి వెలుగుల కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి

జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ  విడత కంటి వెలుగుల  క్యాంపు ప్రారంభోత్సవం కార్యక్రమం కొడకండ్ల మండలం, రామవరం గ్రామం, పాలకుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశములో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు,  జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, తో కలిసి

మాట్లాడుతూ పేదలకి  ఏదీ  అవసరమో  దాని  పైన  మన  ముఖ్య మంత్రి కెసిఆర్ గారు దృష్టి పెడతారనీ,

కంటి  సమస్య లతో  నేడు ఎన్నో బాధలు పడుతున్న  నిరుపేద లకు  వరం లాంటిది కంటి వెలుగు కార్యక్రమం  ద్వారా మెరుగైన వైద్యం అందించాలని  కేసీఆర్ గారి  లక్ష్యం

కంటి వెలుగు లో పరీక్ష లు చేసే  డాక్టర్లకు మంచి  శిక్షణ ఇచ్చారు

మంచి అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందుబాటులో వున్నారనీ

అలాగే మంచి  పరికరాలు  కూడా అందుబాటులో ఉన్నాయి,

కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను ఉచితంగా అందజేస్తమని,

ఒకవేళ అందుబాటులో లేని కంటి అద్దాలు ఆర్డరుపై కేవలం 10 రోజుల్లో ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు,

నేడు చిన్న  పిల్లల దగ్గర నుండి కంటి  సమస్య లు వస్తున్నాయి,

తెలంగాణ రాష్ట్రం లో ఏ  ఒక్కరూ కంటి  సమస్య లతో  బాధ  పడద్దని  మన ముఖ్య మంత్రి ఆశయమని,

పేద కుటుంబ బిడ్డల పెళ్లిళ్ల కోసం, డెలివరీ కోసం కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్ ద్వారా పేద తల్లిదండ్రుల కష్టాలను  తీరుస్తున్న  మహానుభావుడు ముఖ్య మంత్రే అని చెప్పారు, రైతుకు పెట్టుబడి పెట్టి,రైతు బంధు  ద్వారా రైతులను ఆదుకున్న ఘనత  ముఖ్యమంత్రి దే అన్నారు,తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 75 యేండ్లు నీళ్ల  కోసం  కోట్లటా పడిన  రోజులు,  బిందె లు పట్టుకొని రోడ్ ల మీదకు  వచ్చి  ఇబ్బందులు  లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ

జిల్లా వ్యాప్తంగా పక్క ప్రణాళికతో కంటి వెలుగుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు సాగుతున్నామని ఇప్పటికే జిల్లాలో (26) క్యాంప్ లను ఏర్పాటు చేశామని అందులో జనగామ పట్టణంలో రెండు క్యాంపులను ఏర్పాటు చేసినట్లు (24) జనగామ గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేశామని ఇప్పటికే క్యాంపులలో ఏవి మిషన్స్, కళ్ళజోడ్లు,మందులు, అన్ని రకాల వసతులు కల్పించామని సిబ్బందిని అందుబాటులో ఉంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు, జిల్లాలోని ప్రజలు ఈ కంటి వెలుగుల క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని

కంటి వెలుగు కార్యక్రమాల్లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశామని దాని ద్వారా క్యాంపు వివరాలు తదితర సమస్యలు ఫోన్ నెంబర్ 8247847692 ద్వారా సమాచారం, ఫిర్యాదులు అందించవచ్చని ఆయన కోరారు.

అంతకుముందు జనగామ పట్టణంలో బాణాపురం ఐదో వార్డులో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ రజిత తో కలిసి క్యాంపును ప్రారంభించారు,

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, రెవెన్యూ డివిజన్ అధికారి కృష్ణవేణి తో కలిసి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు,

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. మహేందర్, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రామ్ రెడ్డి, డిపిఓ వసంత, కంటి వెలుగుల ప్రత్యేక అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post