కంటి వెలుగు కార్యక్రమం లో వరంగల్ జిల్లా ఆదర్శంగా నిలవాలని అందుకు సంబంధిత అధికారులు శక్తి వంచన లేకుండా పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు

ప్రచురణార్థం

కంటి వెలుగు కార్యక్రమం లో వరంగల్ జిల్లా ఆదర్శంగా నిలవాలని అందుకు సంబంధిత అధికారులు శక్తి వంచన లేకుండా పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు

శనివారం రోజున జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కంటి వెలుగు కార్యక్రమం నడుస్తున్న తీరుతెన్నెల గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం మెడికల్ ఆఫీసర్స్ . కంటి వైద్య నిపుణులు ప్రత్యేక అధికారులతో మండలాల వారీగా కలెక్టర్ రివ్యూ చేశారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందత్వ నివారణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలలో మంచి స్పందన వచ్చే విధంగా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు

రూరల్ ఏరియాల్లో ప్రతిరోజు 300 మంది టార్గెట్ నిర్దేశించగా అర్బన్ ఏరియాలో 400 మంది టార్గెట్ ఉన్నదని.. ప్రస్తుతం మన జిల్లాలో ప్రతిరోజు యావరేజ్ గా133 మందికి కంటి పరీక్ష లు
చేస్తున్నారని తెలిపారు

టాప్ 3 లో నర్సంపేట. గవిచర్ల, నరక్కాపేట
గ్రామాలు ఉన్నాయని..
ఇంకా వేగం పెంచి అనుకున్న లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు

మొబలైజేషన్ లో ప్రోగ్రెస్ చూపించాలని కంటి వెలుగు క్యాంపులలో జనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యాంపులు ఎన్ని రోజులు ఉంచాలి అనేది సమాచారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సమైక్య సభ్యులు,సర్పంచ్ వార్డ్ మెంబర్స్,
కంటి వెలుగు కార్యక్రమం ప్రోగ్రామ్ ఆఫీసర్స్,ఎంపీడీవోలు, వైద్యాధికారులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని చర్చించుకోవాలన్నారు. అవసరమైతే
వేరే చోటికి కంటి వెలుగు క్యాంపు తరలించి అక్కడ కంటి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు

స్టేట్ డేటా ప్రకారం సరిచూసుకోవాలన్నారు

కంటి వెలుగు క్యాంపులలో
ఫుడ్, బ్రేక్ ఫాస్ట్ అన్ని సదుపాయాలు అందేలా చూడాలన్నారు

క్యాంపులలో రికార్డులు వ్రాసే విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకూడదన…రికార్డులన్నీ పరిశీలించిన తర్వాతే ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు

కంటి పరీక్ష చేసే యంత్రాలు ఏదైనా సమస్యలపై ఆగిపోయిన పక్షంలో అటువంటి క్యాంపులలో వెంటనే కొత్త కంటి పరీక్ష చేసే యంత్రాలను ఏర్పాటు చేయాలన్నారు

అలాగే క్షేత్రస్థాయిలో కంటి వెలుగు క్యాంపులను పరిశీలించుకోవాలని సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణను ఆదేశించారు

Share This Post