కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలతో కంటి వెలుగు కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు, శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక కన్నకొడుకులాగా ఆలోచించి గొప్ప ఆలోచనతో చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం ఒక వరం లాంటిదన్నారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించే కంటి వెలుగు కార్యక్రమం కోసం రంగారెడ్డి జిల్లాలో 80 టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు, వీటికి అదనంగా మరో 5 టీంలు కూడా సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జిల్లా ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 12 లోపు జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారంతో 558 గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో ప్రతి వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించి కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేస్తామన్నారు. జిల్లాకు ఇప్పటికే 83 వేల 645 రీడింగ్ గ్లాస్ లు జిల్లాకు వచ్చాయని మంత్రి తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్సులో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు వాణీదేవి, దయనంద్ గుప్తా, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post