కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష

కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష

 

మద్దూర్, కొత్తపల్లి మరియు గూడమాల్, బాపన్ పల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని కంటి సమస్యలతో బాధపడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి వెలుగును పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

సిబ్బంది అందరూ సమయానికి హాజరై శిబిరానికి వచ్చే ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన కంటి అద్దాలను అందజేయాలని సూచించారు.

ఇప్పటివరకు కంటి పరీక్షలు నిర్వహించిన రికార్డులను కలెక్టర్ పరిశీలించారు.

కలెక్టర్ వెంట అధికారులు తదితరులు ఉన్నారు

Share This Post