కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

000000

     జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

      బుధవారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రెస్ భవన్ లో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ అదనపు కలెక్టర్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు 18 సంవత్సరాల పైబడిన వారి కుటుంబ సభ్యుల కోసం రెండు( బుధ, గురువారం) రోజులు కంటి వెలుగు శిబిరం ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సదవకాశాన్ని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

     ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, వైద్య సిబ్బంది, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post