కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎం వెంకట్రావు వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో ప్రజలకు అవగాహన కల్పించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి కళ్ళజోడు అందించాలన్న జిల్లా కలెక్టర్

సూర్యాపేటలోని దురాజ్ పల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమ కేంద్రాన్ని
సందర్శించిన జిల్లా కలెక్టర్, కంటి పరీక్షల కోసం వస్తున్న వారికి కనీస వసతులు కల్పించి, రిజిస్ట్రేషన్ లో పేర్లు నమోదు చేయాలని దూరదృష్టి దగ్గర దృష్టి కి తేడాలను కనిపెట్టి తగ్గట్టుగా కళ్ళజోడ్లను అందించాలన్నారు. కంటి చూపుతో బాధపడుతున్న వారికి సరైన అవగాహన కల్పించి ఎక్కువ స్క్రీనింగ్ లు నమోదుయ్యేటట్లు వైద్యులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ తెలిపారు. ఈరోజు ఎంత మందిని పరీక్షించారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ భూమిక మాట్లాడుతూ ఈ సెంటర్ నందు 760 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వారిలో 160 మందికి దగ్గర చూపు కళ్ళజోళ్ళు అందజేసినట్లు 40 మందికి లాంగ్ డిస్టెన్స్ కలవారి వివరాలను పై అధికారులకు పంపినట్లు డాక్టర్ కలెక్టర్ తెలిపారు. దురాజ్ పల్లి ఐదవ వార్డులోని కంటి పరీక్ష చేయించుకొనుటకు వచ్చిన కంకిపాటి శారద ను ప్రభుత్వం అమలుపరుస్తున్న కంటి వెలుగు కార్యక్రమం మంచిదేనా అని కలెక్టర్ అడిగారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కంటి చూపుతో బాధపడుతున్న పేదవారికి ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం పెట్టి కళ్ళజోళ్ళు అందజేసి వారికి కంటి చూపును ఇస్తుందని శారద తెలిపారు. కంకిపాటి శారద కు పరీక్షలు నిర్వహించిన అనంతరం కలెక్టర్ కళ్ళజోడును అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి కోటాచలం, మెడికల్ ఆఫీసర్ భూమిక, ఆప్తమాలజిస్ట్ కే నిస్వి డేటా ఎంట్రీ ఆపరేటర్ సంగ్రామ్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.
—————————-‘——————
సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారి కార్యాలయం, సూర్యాపేట వారిచే జారి చేయనైనది.

Share This Post