ప్రెస్ రిలీజ్
జనగామ జిల్లా , మే 18, గురువారం
గ్రామాల పచ్చదనం – పరిశుభ్రత అందరి బాధ్యత
కంటి వెలుగు క్యాంపులను తనిఖీ చేసి, ఆయిల్ పామ్ పంటల సాగును పరిశీలంచిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య
గురువారం నాడు జిల్లా కలెక్టర్ శివలింగయ్య పాలకుర్తి మండలం విసునూరు,చిన్న తొర్రూరు, గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పరిశుభ్రత కార్యక్రమాలను స్వయంగా ఇంటింటికి తిరుగుతూ సైడ్ డ్రైనేజీ, అంతర్గత రోడ్లు, ఇంటింటికి జరుగుతున్న సెగ్రీరిగేషన్,నర్సరీలు పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలను పరిశీలించారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రతి గ్రామము వార్డు పరిశుభ్రత పచ్చదనంతో ఉండాలని లక్ష్యంతో సిబ్బంది పని చేయాలని అన్నారు గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలాంటివని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు గ్రామ కార్యదర్శి లు వారికి కేటాయించిన లక్ష్యాలను సమయానుకూలంగా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు,
దేవరుప్పల మండలం చిన్నమడూరులో జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు మండలంలో గ్రామంలో ఇంకా పరీక్షలకు హాజరుకాని వారి వివరాలను గుర్తించి వెంటనే పరీక్షలు చేయించుకొనుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు వైద్య పరీక్ష నిమిత్తం వచ్చిన వారితో మాట్లాడుతూ వారికి అందుతున్న సేవలు గురించి తెలుసుకున్నారు,
పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామంలో ఆయిల్ పామ్ పంటల సాగుపై రైతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు అధిక దిగుబడి కలిగిన ఈ పంటలను అందరూ ఎంచుకోవాలని సూచించారు ,
ఈ తనిఖీల్లో ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, ఉద్యానవన శాఖ అధికారి లత, ఎంపీడీవోలు అశోక్ కుమార్, సురేష్ కుమార్, కంటి వెలుగు ప్రోగ్రాం అధికారులు డాక్టర్ భాస్కర్, డాక్టర్ అశోక్, సంబంధిత విభాగాల సిబ్బంది ఉన్నారు.