ప్రెస్ రిలీజ్
జనగామ జిల్లా, జనవరి 20
కంటి వెలుగు క్యాంప్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య
శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, లింగాల ఘనపూర్ మండలం,నెల్లుట్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంప్ ను ఆకస్మిక తనిఖీ చేసారు క్యాంపు కు వచ్చిన బెనిఫిషర్స్ కు అందున్న వైద్య పరీక్షలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు, బెనిఫిషర్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని పరీక్షలకు అవసరం మైన అన్ని సిద్దంగా ఉంచుకోవాలని మందులు, గ్లాస్ లు, వెంటనే అందించాలని క్యాంప్ లో బెనిఫిషర్స్ కు త్రాగు నీరు,కుర్చీలు సమకుర్చలన్నారు,
అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జనగాం మండలం, ఓబులకేశవాపూర్ గ్రామంలో జరుగుతున్న కంటి వెలుగు క్యాంప్ ను తనిఖీ చేసి బెనిఫిషర్స్ తో మాట్లాడి అందుతున్న వైద్య పరీక్షల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు,
ఈ తనిఖీలో కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి కెఆర్.లత , కంటి వెలుగు లైజన్ ఆఫీసర్ రోజారాణి, డాక్టర్ కారుణాకర్ రాజు, తహసిల్దర్ అంజయ్య, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.