కంటి వెలుగు నిర్వహణకు పక్కా కార్యచరణ అమలు:: రాష్ట్ర మహిళా, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

ప్రచురణార్థం…..1
తేదీ. 05.1.2023

కంటి వెలుగు నిర్వహణకు పక్కా కార్యచరణ అమలు:: రాష్ట్ర మహిళా, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

 

అవసరమైన వారికి వెంటనే రీడింగ్ కళ్ళద్దాలు, నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీ

జిల్లాలో 25 బృందాల ద్వారా కంటి వెలుగు శిబిరాల నిర్వహణ

ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయి నుంచి ఉత్సాహంగా పాల్గోన్ని విజయంతం చేయాలి

వచ్చే విద్యా సంవత్సరం నుంచి భూపాలపల్లి జిల్లాలో వైద్య కళాశాల ప్రారంభం

కంటి వెలుగు నిర్వహణ పై జిల్లా స్థాయి సమన్వయ, కార్యాచరణ సమావేశం నిర్వహించిన మంత్రి

జయశంకర్ భూపాలపల్లి , జనవరి 5
జిల్లాలో ప్రజలందరికీ కంటి వెలుగు శిబిరాల ద్వారా కంటి పరీక్షలు నిర్వహించేందుకు రూపోందించిన కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర గిరిజన అభివృద్ధి , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఇల్లెందు అతిథి గృహం సమావేశ మందిరంలో కంటి వెలుగు శిబిరాల నిర్వహణ పై జిల్లా స్థాయి సమన్వయ, కార్యాచరణ సమావేశాన్ని జిల్లా కలెక్టర్, స్థానిక ఎమేల్యే లతో కలిసి మంత్రి నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలను పకడ్బందీగా నిర్వహిస్తూ ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలను పంపిణీ చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజల్లో నూతన వెలుగులు నింపాలని ఆమె సూచించారు.
జిల్లాలో కంటి వెలుగు బృందాలు శిబిరాలకు సమీపంలోని మండల హెడ్ క్వార్టర్లో నివాసముండే విధంగా చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే నేపద్యంలో ఉదయం పూట గంట ముందు శిబిరాలు ఏర్పాటు చేయాలని, అదే విధంగా సాయంత్రం సైతం అదనంగా మరో గంట ఉండాలని మంత్రి సూచించారు. జిల్లాలో ఉన్న గ్రామాలు ఆవాసాలు లో సైతం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున కంటి పరీక్షల ఎక్కడా చేయడం లేదని, సీఎం కేసీఆర్ పేదల పట్ల అమితమైన ప్రేమతో ఆలోచించి రూపకల్పన చేసారని, ఈ అంశంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సాధిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా 100 పని దినాల వ్యవధిలో కంటి వెలుగు శిబిరాల నిర్వహించి, 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అవసరమైన వారికి కళ్లద్దాలను అందిస్తామని మంత్రి తెలిపారు.

జిల్లాలోని గ్రామీణ , పట్టణ ప్రాంతాలలో ప్రజా ప్రతినిధులు కంటి వెలుగు కార్యక్రమంలో చురుగ్గా పాల్గోనాలని, కంటి వెలుగు క్యాంపులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని , పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తుందని, జయశంకర్ భూపాలపల్లిలో ఇటీవలె జిల్లా ఆసుపత్రి ప్రారంభించుకున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి వైద్య కళాశాల లో తరగతులు ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు.

పేద ప్రజలకు సమీపంలో వైద్య సేవలు అందించే దిశగా పల్లె దవాఖానా లు, బస్తీ దవాఖానాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని , దీని కోసం అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ చేపడుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలను పకడ్బందీగా అధికారులు అమలు చేయాలని, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 241 గ్రామాల్లో 391 ఆవాసాలు, మున్సిపాలిటీలోని 30 వార్డులో కంటి పరీక్షలు నిర్వహించేందుకు 25 బృందాల ఏర్పాటు చేసామని, ప్రతి బృందం లో 8 సభ్యులు ఉంటారని, వీరికి వాహనం, బోజనాలు, అవసరమైన సామాగ్రి సిద్ధం చేసామని తెలిపారు.

ప్రపంచంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు అమలు చేయడం లేదని, ప్రైవేటులో కంటి పరీక్షలు నిర్వహించుకుని అద్దాలు తీసుకుంటే దాదాపు 3000 నుంచి 4000 ఖర్చు అవుతాయని, ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు ద్వారా ప్రజలకు ఉచితంగా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీలైనంత మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంపై అధిక శ్రద్ధ వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కల్పిస్తుందని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా ఆస్పత్రి ప్రారంభించుకున్నామని, ఆయుష్ ఆసుపత్రి మంజూరు చేసుకున్నామని, వచ్చే సంవత్సరం ప్రారంభిస్తామని తెలిపారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వైద్య కళాశాల ప్రారంభమవుతుందని, అవసరమైన వైద్యులు నియామకం చేపట్టామని, పల్లె దవాఖానాలు బస్తి దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నామని అన్నారుమనందరికీ కళ్ళు చాలా ముఖ్యమైనవని , వాటి రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా అమలు చేయాలని అన్నారు
అనంతరం మంత్రి గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఇటీవల జిల్లాలో నియమకాము చెంది, వీధుల్లో చేరిన 12 మంది మెడికల్ ఆఫీసర్లకు శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్పెర్సన్ శ్రీ హర్షిణి, మున్సిపాల్ చైర్పెర్సన్ వెంకటరాణి సిద్దూ, జెట్పిటీసీలు, ఎం.పి.పి.లు, ఎం.పి.టి.సి.లు, గ్రందాలయ సంస్థ చైర్మెన్ బి.రమేశ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీరామ్, మండల ప్రత్యేక అధికారులు, వైద్యులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.

Share This Post