కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే అనుమానితులను క్షయ నిర్దారణ పరీక్షలు చేయాలి- జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే అనుమానితులను క్షయ నిర్దారణ పరీక్షలు చేయాలి

– సాధ్యమైనంత ఎక్కువగా శాంపిల్ లు సేకరించాలి

-గర్భవతుల నమోదు శతశాతం చేయాలి

– కాన్పులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలి

– ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీ ల సంఖ్యను పెంచాలి

– మొదటి కాన్పుల పై ప్రత్యేక దృష్టి సారించాలి

 

– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

——————————-

కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే గ్రామాల్లో అనుమానితులను క్షయ నిర్దారణ పరీక్షలు చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.
జిల్లాలో సాధ్యమైనంత ఎక్కువగా శాంపిల్ లు సేకరించడం వల్ల క్షయ వ్యాధి బాధితుల ను గుర్తించి అవసరమైన చికిత్స అందించవచ్చునని చెప్పారు.

శనివారం గంభీరావుపేట లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.
అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిని లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సబ్ సెంటర్ ల వారీగా సమీక్ష నిర్వహించారు.

సబ్ సెంటర్ వారీగా గర్భవతుల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థాగత డెలివరీలు, క్షయ వ్యాధి బాధితుల గుర్తింపు, చికిత్స తదితర అంశాలపై ANM లను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ….

జిల్లాలో గర్భవతుల నమోదు కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి శతశాతం లక్ష్యం పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం లో గర్భవతుల నమోదు సగటు 99 శాతం ఉంటే జిల్లాలో అది 93 శాతం ఉందని అన్నారు.

సాధ్యమైనంత ఎక్కువగా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేలా చూడాలన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రులలో జరిగే ప్రసవాలలో చాలా మటుకు సిజేరియన్ లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు దీనివల్ల పేద ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు .
మరోవైపు బాలింతలు కూడా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉందన్నారు.
దీన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి కాన్పులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రులలో నార్మల్ డెలివరీ లు అయ్యేలా గర్భిణులను వారి కుటుంబ సభ్యులను ANM లు మోటివేట్ చేయాలన్నారు.

క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన ఏఎన్ఎం లకు మెమెంటో, శాలువా తో సత్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

కంటి వెలుగు కార్యక్రమం లో ట్యాబ్ ఎంట్రీ పక్కాగా చేయాలని చెప్పారు. అవసరమైన వారికి కళ్లద్దాలు ఇవ్వాలని అన్నారు.

PHC బిల్డింగ్ ఎక్సలెంట్… ఎన్క్వాస్ లో మంచి స్కోర్ రావాలి

లింగన్న పేట PHC బిల్డింగ్ ఎక్సలెంట్… గా ఉంది…
ఎన్క్వాస్ లో మంచి స్కోర్ రావాలి.. తద్వారా ఒక నెలలోనే ఎన్క్వాస్ సర్టిఫికేట్ వచ్చేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని లాబరేటరీ, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ ,మెడికల్ స్టోర్ రూమ్, డిస్పెన్సరీ ,పురుషులు స్త్రీల వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఓపి సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. గత నెలలో ఓపి 84 ఉందని వైద్యులు తెలుపగా ఒపి నీ మరింతగా పెంచేందుకు కృషి చేయాలని వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

 

సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా డిప్యూటీ వైద్యాధికారి డా. శ్రీరాములు, ప్రోగ్రాం అధికారి డా మహేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, సబ్ సెంటర్ ANM లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

 

Share This Post