కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించిన ” జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య

ప్రచురణార్థం

“కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించిన ” జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య

గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని కొమ్మాల గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ పి. ప్రావీణ్య ఆకస్మికంగా పరిశీలించారు

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ
కంటి వెలుగు శిబిరం ద్వారా కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది ,కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ తెలిపారు

శిబిర నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి ప్రజలందరికీ కంటి పరీక్షలు చేయాలన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ గోపాలరావు ,స్థానిక వైద్యాధికారి డాక్టర్ మాధవి లత ,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి మరియు కంటి వెలుగు శిబిరంలోని వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post