కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలో 313 గ్రామాల్లో 18 సంవత్సరాలు పైబడిన 7,93,857 లబ్ధిదారుల గుర్తింపు

18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరాలలో కంటి పరీక్షలు చేయించుకోవాలి

100 రోజుల పాటు శిబిరాల నిర్వహణ

కంటి పరీక్షలు నిర్వహణకు 48 బృందాలు

ఇప్పటి వరకు 11586 మందికి కంటి పరీక్షలు

. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

00000

     రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలలో కంటి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.

 

 

      రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో దశ కార్యక్రమములో 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కంటి పరీక్షలు చేయించుకొని కంటి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన 7,93,857 మందికి కంటి పరీక్షలు నిర్వహణ లక్ష్యంగా 100 రోజులపాటు నిర్వహించే కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు 48 బృందాలను ఏర్పాటుచేసి జనవరి 19 నుండి జిల్లాలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కంటి వెలుగు శిబిరాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.  కంటి వెలుగు రెండో విడత లో భాగంగా కరీంనగర్ జిల్లాలో 5536 మహిళలక,6050 పురుషులకి మొత్తం 11,586 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 49 చోట్ల కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతున్నదని, ఈ శిబిరాల్లో ఇప్పటివరకు2454 రీడింగ్ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. 2038 మందికి ప్రిస్క్రైబ్ అద్దాలను సూచించడం జరిగింది. వీరికి వారం రోజుల్లో కంటి అద్దాలు పంపించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జనవరి 30 సోమవారం రోజున కరీంనగర్ పట్టణంలో వార్డ్ నెంబర్ 5,7,11, 17 ,22 ,27,33 ,35 ,37 ,42 ,51 ,57 ,హుజరాబాద్ పట్టణంలో వార్డు నెంబర్ 7 ,23 ,27 ,పెద్ద పాపయ్యపల్లె, చల్లూరు ,చిగురుమామిడి ,ముల్కనూర్, చొప్పదండి వార్డ్ నెంబర్ 11,గుండి ,గోపాలరావుపేట్ ,కొత్తపల్లి, ఆసిఫ్ నగర్ ,మానకొండూర్ ,చెంజర్ల , లక్ష్మీపూర్ ,రామడుగు, సైదాపూర్,ఎలాబోతరం ,శంకరపట్నం, కొత్తగట్టు, తిమ్మాపూర్, రామకృష్ణ కాలనీ, సైదాబాద్ ,వావిలాల,జమ్మికుంట వార్డ్ నెంబర్ 2, 24 ,వీణవంక గ్రామాలలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించబడుతుందని కలెక్టర్ తెలిపారు.18 సంవత్సరాలు పైబడిన వారందరూ కంటి వెలుగు శిబిరాలలో పాల్గొని తమ కంటి సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ తెలిపారు.

Share This Post