కంటి వెలుగు శిబిరాల్లో ప్రజలకు మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ కె.శశాంక.

*ప్రచురణార్ధం

మహబూబాబాద్, ఫిబ్రవరి.07.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్యాధికారి హరీష్ రాజ్ అధ్యక్షతన కంటివెలుగు -2 కార్యక్రమం పై అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ట్రైనీ కలెక్టర్ పింకేశ్వర్ తో కలిసి పి.హెచ్. సి ల వారీగా మెడికల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాల్లో క్వాలిటీ పర్యవేక్షణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రంలో అవసరమైన మేరకు కాంతిని ఏర్పాటు చేసుకుని పరీక్షలు నిర్వహించి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.

ప్రతి కేంద్రంలో మెడికల్ అధికారులు ప్రత్యేక చొరవతో కంటి శిబిరాల్లో ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు చూసుకోని సమస్యను పరిష్కరించాలని అన్నారు. కంటి వెలుగు శిబిరాలలో వైద్య సిబ్బందికి అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగు శిబిరాల్లో ప్రజలకు ఎటువంటి అవరోదాలు తలెత్తకుండా అవసరమైన రీడింగ్ గ్లాసెస్ అందుబాటులో ఉండేలా స్పెషల్ అధికారులు చూసుకోవాలని, ట్యాబ్ ఎంట్రీ విధానం సరిగా జరగాలని, వైద్య సిబ్బంది శిబిరానికి చేరుకోవడానికి ట్రాన్స్ పోర్టేషన్ ఇబ్బందులు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రతీ శిబిరం నిర్ణీత సమయంలో ప్రారంభం అవ్వాలని, అదే విధంగా బృందాల వారీగా నైట్ షిఫ్ట్స్ లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ అధికారులు రోజు వారీ షెడ్యూల్ కు సంబంధించిన టూర్ డైరీలను
నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. జిల్లా కోర్టు సిబ్బందికి, మీడియా వారికి ప్రత్యేక కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోజువారి కంటి వెలుగు శిబిరాల షెడ్యూల్ వివరాలను ప్రెస్ రిలీజ్ చేపించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం మెడికల్ అధికారి అంబరీష్, పి.హెచ్. సి.మెడికల్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Share This Post