తెల౦గాణ రాష్ర్ట ప్రభుత్వం
( జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం – హనుమకొండ )
పత్రిక ప్రచురణార్ధం తేదీ: 30/11/2022
కంటి వెలుగు – II కార్యక్రమం క్రింద అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులను స్వీకరిస్తున్నామని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖధికారి డాక్టర్.బి. సాంబశివ రావు గారు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు – II కార్యక్రమం క్రింద హనుమకొండ జిల్లాలో 48 మంది పారా మెడికల్ ఆప్తలమిక్ ఆఫీసర్ లను ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేయుటకు నెలకు రూ.30,000/- పారితోషికం చెల్లించే విధముగా 2 సo. రాల డిప్లమ ఇన్ ఆప్తలమిక్ అసిస్టంట్ లేదా డిప్లమ ఇన్ అప్థోమెట్రీ కోర్సు పూర్తి చేసిన వారు ఈ యొక్క పోస్టులకు డిసెంబర్ 1 నుండి 5 వ తేదీ వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయంలో ధరఖాస్తులను సమర్పించాలని, డిసెంబర్ 7 తేదీన ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ను విడుదల చేస్తామని ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో 8 వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు లిఖిత పూర్వకంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమర్పించాలని డిసెంబర్ 10 వ తేదీన తుది మెరిట్ లిస్ట్ ను మరియు సెలక్షన్ లిస్ట్ ను కార్యాలయంలో ప్రదర్శిస్తామని ఆయన తెలిపారు. ఏ పారా మెడికల్ ఆప్తలమిక్ ఆఫీసర్ కు పని చేయు ఆటో రిఫ్రాక్టివ్ మిషిన్ ఉన్నట్లైతే వారికి మొదటి ప్రాదాన్యత ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.
జిల్లా పౌర సంబందాల శాఖాధికారి, హనుమకొండ గారి ద్వారా అన్ని పత్రికలలో ప్రచురణ నిమిత్తం సమర్పించనైనది.