కంబాలపురంలో సాగుచేసిన ఆయిల్ ఫామ్ చెట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
28. 10 .2021 .
వనపర్తి

రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష రైతులకు సూచించారు. గురువారం జిల్లాలోని కంబాల పురం లో సాగుచేసిన ఆయిల్ ఫామ్ చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఆయిల్ పామ్ తోటల సాగు వివరాలు తెలుసుకున్నారు. రైతులు ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తే వాటిలో అంతర్ పంటలు కూడా వేయడానికి వీలు ఉంటుందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీరంగాపురం లోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ప్రకృతి వనం ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా మొక్కలకు నీరు అందించాలని నర్సరీ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

……………. జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి చే జారీ చేయడమైనది.

Share This Post