కంభాలపల్లి ZPHS ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె.శశాంక.

ప్రచురణార్ధం

కంభాలపల్లి ZPHS ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె.శశాంక.

మహబూబాబాద్, సెప్టెంబర్-04:

శనివారం రోజున మధ్యహ్నం జిల్లా కలెక్టర్ కె.శశాంక కంభాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిల్లల హాజరును, పాఠశాలలో ఉన్న మౌఌక వసతులను పరిశీలించారు.

పిల్లల హాజరును పెంచాలని, ఇందుకు గాను బడికి రాని పిల్లల తల్లిదండ్రులను కలిసి పిల్లలను బడులకు పంపే విధంగా మోటివేషన్ చేయాలని తెలిపారు. కరోనా వలన చాలా వ్యవధి తర్వాత బడులు తెరిచినందున పిల్లల చదువుపై దృష్టి పెట్టి, వారికి ఆసక్తి కలిగే విధంగా బోధించాలని ఉపాధ్యాయులకు తెలిపారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు పిల్లలకు బోధిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. పిల్లలను ఉపాధ్యాయులు చెప్పేవి అర్ధం అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి, 9వ తరగతి విద్యార్ధులతో పాఠ్యాంశాలపై ఉన్న విషయ పరిజ్ఞానాన్ని పరిశీలించారు. చిన్నప్పటి నుండే చదువు విశిష్టత తెలిపి, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు అధిరోహించేలా వారికి చదువు పట్ల అవగాహన కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. పాఠశాలకు హాజరైన పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని, ఉపాద్యాయులు, సిబ్బంది వ్యాక్సినేషన్ చేయించుకోవాలని తెలిపారు. పాఠశాల ఆవరణ ఆహ్లాదకరంగా, తరగతి గదులు పరిశుభ్రంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు.

——————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయం చే జారీ చేయనైనది.

Share This Post