కక్షిదారులకు సత్వర న్యాయ సహాయం అందించాలి జిల్లా జడ్జి బి. ప్రతిమ

కక్షిదారులకు సత్వర న్యాయ సహాయం అందించాలి

జిల్లా జడ్జి బి. ప్రతిమ

0 0 0 0

       

       

      న్యాయ సహాయం కొరకు న్యాయస్థాలకు వచ్చే కక్షీదారులకు సత్వర న్యాయ సహాయం అందేలా కృషిచేయాలని జిల్లా జడ్జి బి. ప్రతిమ అన్నారు.

       గురువారం రాష్ట్రంలోని 33 జిల్లాలలో నూతన జిల్లా కోర్టులను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,సుప్రీం కోర్ట్  చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ లు హైదరాబాద్ లో కోర్టు భవనాన్ని ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గోని వారి సందేశాలను అందించిన కార్యక్రమాన్ని వర్చువల్ ద్వారా వీక్షించిన అనంతరం జిల్లా కోర్టులో జిల్లా జడ్జి  బి. ప్రతిమ, జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్,  కమీషనర్ ఆఫ్ పోలీస్  సత్యనారాయణ లు ప్రారంబోత్సవం పనులకు ప్రారంభించారు.  ఈ సందర్బంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ రాష్ట్రం లో 33  జిల్లాలు ఏర్పాటు అయిన తరువాత జిల్లాలలో నూతన కోర్టులు ప్రారంభమవడం శుభపరిణామంగా పరిగణించారు.  నూతన జిల్లా ఏర్పాటుతో న్యాయమూర్తుల సంఖ్య తగ్గినప్పటికి ఉన్నప్పటికి  కేసుల సంఖ్యమాత్రం తగ్గడంలేదని అన్నారు.  కక్షిదారులకు  న్యాయం అందించడంలో ఆలస్యం జరగకుండా చూడాలని పేర్కోన్నారు.   కరీంనగర్ జిల్లాతో పాటుగా నూతన కోర్టు భవనాల స్థాపనలో తమవంతు సహాకారాన్ని అందించిన రాజన్నసిరిసిల్లా, పెద్దపల్లి మరియు జగిత్యాల జిల్లా కలెక్టర్ లకు దన్యవాదాలు తెలిపారు.   ప్రస్తుత పరిస్థితులలో  కోర్టులో విచారణకు వచ్చే కేసుల వివరాలు  కోర్టు ఇన్ఫర్మెషన్ సిస్టమ్ ద్వారా అదేరోజు సాయంత్రానికల్లా తెలుసుకునే స్థాయికి అభివద్ది చెందిందని అన్నారు.  అదేవిధంగా న్యాయముర్తులకు కేసుల విచారణలో ఎవైన సమస్యలు ఏదరురైతే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కోన్నారు.

            ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, కరీంనగర్ పోలీస్ కమీషనర్ సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, న్యాయుమూర్తులు పాల్గోన్నారు.

Share This Post