కడుకుంట్లలోని ఆయిల్ పామ్ తోటలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
25 .11 .2021 .
వనపర్తి

ఆయిల్ పామ్ తోటల ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అన్నారు. గురువారం కడుకుంట్ల లోని ఆయిల్ పామ్ తోటలను కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలించి మొక్కలు పెంచే విధానం వాటి దిగుబడి తదితర అంశాలను తెలుసుకున్నారు. వనపర్తి జిల్లాలో వంటనూనె ఉత్పత్తి పెంచడానికి అధిక దిగుబడినిచ్చే ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచడమే మార్గమని  ప్రభుత్వ విధానoగా నిర్ణయించింది.ఈ క్రమంలో భారతీయ ఆయిల్ పామ్ పరిశోదన సంస్థ పంట సాగుకు అన్ని విషయాల్లో పరిశోధించి, వనపర్తి జిల్లాను సాగుకొరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నోటిఫై చేసి సాగును ప్రోస్తాహిస్తున్నాయి. ప్రతి రైతు తమ పొలంలో ఆయిల్పామ్ సాగు చేసి దిగుబడులు సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ పామ్ పంట అన్నీ రకాల నేలల్లో పండుతుంది.నీరు నిలబడని లోతైన,అధిక సేంద్రీయ పదార్థములు కలిగి, నీరు తేలికగా ఇంకిపోయే నేలలు మంచివి. ప్రపంచం మొత్తము లో పండించే ఏకైక రకం టేనేరా హైబ్రిడ్ ఒక్కటే
సాగు వంగడము .
ఏ కాలంలో నైనా నీటి  వసతి ఉన్నచో ఆయిల్ పామ్ మొక్కలను నాటవచ్చును.వర్షాకాలం బాగా అనుకూలమైంది.వేసవిలో  నాటేటట్లైతే వేడిని తట్టు కొనుటకు సమృద్ధిగా సాగునీరందించాలి. వేసవి వేడిని తట్టుకొనుటకు వ్యవసాయ వ్యర్ధాలను పాదులో వేసి పాది చుట్టూ 1.5 మీటర్ల ఖైవారంలో జనుము నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతాయి.
హెక్టారుకు 143 మొక్కలు లేదా ఎకరాకు 57 మొక్కలు 9మీ x 9మీ x 9 మీ త్రికోణ పద్దతిలో నాటుకోవాలి.
60 x 60x 60 సెంటిమీటర్ల లోతు వెడల్పు, పొడవు తీసిన గుంతలలో నాటుకోవాలి.
నాటుతకు ముందు  ప్రతి గుంతకు 400 గ్రాముల SSP, 50 గ్రాముల ఫోరెట్ గుళికలు వేసి గుంతలు పూడ్చాలి.
మొక్కలు నర్సరీ నుండి తెచ్చుకునే తప్పుడు 12 నెలలు పెంచిన ,12 వ్యాపించిన ఆకుల కల్గి,ఒక మీటరు ఎత్తు పెరిగిన మొక్కలను నాటుటకు ఎన్నుకోవాలి.
నాటిన మొక్కలకు సమృద్ధిగా సాగునీరు అందించాలి
1.ఎకరాకు 57 మొక్కలు
2.మొక్క ఖరీదు ప్రస్తుతం ప్రభుత్వనిర్ణయం ప్రకారం ఆయిల్ పామ్ మొక్క ఒక్కటికి రూ.117 గా నిర్ణయయించింది.
3. మొక్క ఖరీడులో ప్రభుత్వం రూ.84.రాయితీ ఇస్తుంది.
4.రైతులు కేవలం రూ.33. మాత్రమే తమ వాటగా చెల్లించాలి.
5.ఆయిల్ పామ్ తోటలు 5 వ సంవత్సరంలో ఆర్ధిక దిగుబడినిస్తాయి.
6. 5వ  సంవత్సరంలో ఎకరాకు సుమారుగా 10 టన్నుల గెలలు
కాస్తాయి.
7. 5వ సంవత్సరం నుండి పంట దిగుబడి వస్తుది కావున అప్పటి వరకు              అంతరపంటలైన వేరు శెనగ, పెసర్లు,ఉలవలు, కూరగాయల్లాంటివి సాగు చేసుకోవచ్చును.
8.ఇట్టి అంతర పంట  విత్తనాలకు గాను రూ.2000 మరియు అంతర కృషి కొరకు రూ.2000 మొతంగా ఎకరాకు రూ.4000  రాయితీ ప్రోత్సహంగా ప్రభుత్వం అందిస్తుంది.
9. గెలలు ప్రభుత్వ ఆమోదిత కంపెనీ ద్వారా కొనుగోలు ఏర్పాట్లు చేస్తున్నారు.
10. గెలల రవాణా కొరకు కూడా కొంత రాయితీ కల్పిస్తుంది.
ప్రత్యేకంగా oilpam act పరిధిలోకి ఆయిల్ పామ్ పంటకు అన్ని రకాల ప్రోత్సహకాలు అందిస్తుంది.ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.

…………. జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయబడింది.

Share This Post