కనగల్ మండలం జి.యెడవల్లి గ్రామంలో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులతో కలిసి ఇరిగేషన్ శాఖ స్వాధీనం చేసుకున్న భూముల్లో సాగు చేసుకుంటున్న రజక వృత్తి దార్ల తో జాతీయ బి.సి.కమిషన్ సభ్యులు ఆచార్య తల్లోజు సమావేశం

కనగల్ మండలం జి.యెడవల్లి గ్రామంలో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులతో కలిసి ఇరిగేషన్  శాఖ స్వాధీనం చేసుకున్న భూముల్లో సాగు చేసుకుంటున్న రజక వృత్తి దార్ల తో జాతీయ బి.సి.కమిషన్ సభ్యులు  ఆచార్య తల్లోజు సమావేశం జరిపి వారి సమస్యలు విన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,సర్వే ల్యాండ్ శాఖ ఏ.డి.శ్రీనివాస్,దేవర కొండ ఆర్.డి.ఓ.గోపి రాం, ఇరిగేషన్ అధికారులతో కనగల్ మండలం జి.యెడవల్లి గ్రామం లో ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఎస్.ఎల్.బి.సి కెనాల్ కు   స్వాదీనం  చేసుకున్న భూముల ను తాము ఎన్నో సంవత్సరాలు గా సాగు చేసుకుంటున్న వాటిని ఇప్పించాలని బి. సి.కమిషన్ కు విన్నవించు కున్నారు. అలాగే డిండి ఎత్తి పోతల పథకం కారణంగా భూములు కోల్పోయిన రైతులు పెట్టుకున్న పిటిషన్ పై  బి.సి.కమిషన్ సభ్యులు ఆచార్య తల్లోజు జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,సర్వే ల్యాండ్స్,రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులతో సమావేశం జరిపి చర్చించారు.

Share This Post