కనాయపల్లి భూ నిర్వాసితుల సమస్యలపై సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.   తేది:22.09.2022, వనపర్తి.

కనాయపల్లి భూ నిర్వాసితులకు పునరావాసాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.
గురువారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో కనాయపల్లి గ్రామ భూ నిర్వాసితుల సమస్యలపై, పునరావాస కేంద్రాలపై దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముంపు గ్రామాల పునరావాస బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, కానాయపల్లి గ్రామంలో పునరావాసం కోల్పోయిన కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు, వారికి పరిహారం అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. కనాయపల్లి గ్రామ పరిధిలో 18 సంవత్సరాలు నిండిన 339 మంది బాధితులు ఉన్నారని, వీరిలో 311 మందిని అర్హులుగా గుర్తించి ప్రతిపాదనలు పంపినట్లు ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అధికారులు, కనాయపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post