*కనీవినీ ఎరగని రీతిలో పట్టణంలో అభివృద్ధి పనులు, అభివృద్ధే అజెండాగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం …మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*

*కనీవినీ ఎరగని రీతిలో పట్టణంలో అభివృద్ధి పనులు, అభివృద్ధే అజెండాగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం …మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*

ప్రచురణార్థం

*కనీవినీ ఎరగని రీతిలో పట్టణంలో అభివృద్ధి పనులు, అభివృద్ధే అజెండాగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం …మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*

*సిసి రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు శ్రీకారం*

తొర్రూరు,
మహబూబాబాద్ జిల్లా, ఏప్రిల్ -26:

తొర్రూరు మున్సిపాలిటీ లోని 16 వార్డుల్లో ఒక్కొక్క వార్డులో సుమారు 50 లక్షల చొప్పున నిధులతో ఏర్పాటు చేయు సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువల పనులకు మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి శంకుస్థాపన చేశారు.

తొర్రూర్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా వాడవాడలా తిరుగుతూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలు సద్వినియోగం చేసుకొవాలని, ప్రతి మారుమూల పల్లెలు, పట్టణాలు సబ్బండ జాతుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి అన్నారు

అడుగడుగునా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు పుష్పాభిషేకం చేస్తూ, మేళతాళాలతో, కోలాటాల తో మహిళలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, పాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేసుకొని తొర్రూర్ డివిజన్ కేంద్రం మున్సిపాలిటీగా హోదా కల్పించుకొని అన్ని విధాలుగా అభివృద్ధి లో ఆదర్శప్రాయంగా తొర్రూర్ పట్టణాన్ని సుందరీకరణ చేసుకుంటున్నామని, పట్టణంలో డివైడర్ ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, పట్టణ ప్రకృతి వనాలు, పార్క్లు, వివిధ రకాల భవనాలు, సిసి రోడ్లు, మురికి కాలువ డ్రైనేజ్ నిర్మాణాలతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, ప్రతి వార్డులో సుమారు 50 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు.

70 ఏళ్ల గత పాలనలో నోచుకోని అభివృద్ధి, ఏడేండ్ల నుండి ఆదర్శప్రాయమైన నిర్మాణాలు అభివృద్ధి, వినూత్న సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజల జీవన విధానంలో ఎన్నో మార్పులను తెస్తూ, వలసలను తగ్గుముఖం పట్టిస్తూ, కరోనా కష్టకాలంలో కంటికి రెప్పలా కాపాడుకొని, రైతుల అభివృద్ధి కై రైతుబంధు, నాణ్యమైన 24 గంటల కోతలు లేని కరెంటు సరఫరా, ప్రతి పొలానికి జలాలను అందిస్తున్నామని, రైతు బీమా, స్త్రీల అభ్యున్నతికి అమ్మ ఒడి, కేసీఆర్ కిట్లు, తల్లీబిడ్డల సంక్షేమం ప్రభుత్వం బాధ్యతగా పలు సౌకర్యాలు కల్పించి ఆదుకుంటుంది అన్నారు. ప్రతి గడపకు మిషన్ భగీరథ నీరును అందిస్తూ ఆడపడుచుల కష్టాలను తీర్చారని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదరించాలని, భవిష్యత్తులో మరింత అభివృద్ధిని ఆకాంక్షించాలని మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మంత్రివర్యులు తెలిపిన విధంగా మంజూరు చేసి గ్రౌండింగ్ అయిన పనులు త్వరితగతిన అధికార యంత్రాంగం ద్వారా పూర్తి చేయిస్తానని తెలిపారు. ఈ వేసవిలోగా పనులు పూర్తి చేసి కాలనీ వాసులకు అందించాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టి.యు.ఎఫ్.డి.సి., సబ్ ప్లాన్ అయిన, డబుల్ బెడ్ రూం అయిన అన్నిపనులు త్వరితగతిన పూర్తి చేసుకుంటామని, మంత్రివర్యులు పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు కు ఎక్కువ నిధులు మంజూరు చేయించి పనులు చేయిస్తున్నారని, తొర్రూరు మునిసిపాలిటీలో 20 వేల జనాభా కంటే తక్కువ ఉన్నప్పటికీ టి.యు.ఎఫ్.డి.సి.లో మొదటి సారి 20 కోట్లు మంజూరుతో పనులు పూర్తి చేసుకొని, మరో 20 కోట్ల నిధులు మంజూరు కు మంత్రివర్యులు ప్రయత్నం చేస్తున్నారని, ఇంత తక్కువ జనాభాకు ఇంత పెద్ద మొత్తం పెట్టిన సందర్భం ఎక్కడ లేదని, వారు మంత్రిగా, ముఖ్యమైన నేతగా రాష్ట్రంలో ఉన్నందున ఇది సాధ్యమైంది అన్నారు. పార్క్, అందమైన రోడ్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ తో ఆకర్షణీయంగా తొర్రూరు పట్టణం రూపు దిద్దుకున్నదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్ పర్సన్ సురేందర్రెడ్డి, ఎంపీపీ చిన్న అంజయ్య, జెడ్ పి టి సి శ్రీనివాస్, వివిధవార్డుల కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డా, పోనుగోటి సోమేశ్వర్ రావు, ఇతర సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post