కబడ్డీ పోటీలను తిలకించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

కబడ్డీ పోటీలను తిలకించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, ఏప్రిల్ – 26:

ఉద్యోగుల క్రీడా పోటీలలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను జిల్లా కలెక్టర్ కె. శశాంక తిలకించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఉద్యోగుల కబడ్డీ పోటీలను తిలకించి పోటీలలో పాల్గొనే ఉద్యోగులను ఉత్సాహపరిచి, ఆటలు ఆడుతున్న వారిని కలిసి వివరాలు అడిగి అభినందనలు తెలిపారు. పోటీలలో పాల్గొంటున్న ఉద్యోగుల తో గ్రూప్ ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా పాఖాల, కడం టీముల మధ్య జరిగిన కబడ్డీ ఫైనల్ పోటీని పూర్తిగా తిలకించారు. ఫైనల్ లో పాఖాల టీమ్ గెలుపొందడం జరిగింది.
—————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post