కమలాపూర్ మండలం లోని ముగ్గురు లబ్ధిదారులకు దళిత బంధు పధకం కింద గ్రౌండింగ్ పూర్తి అయినట్లు కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేడొక ప్రకటన లో తెలిపారు.

కమలాపూర్ మండలం లోని కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన మాట్ల సుభాష్ కు సెంట్రింగ్ సామగ్రినీ ,శనిగరం గ్రామానికి చెందిన నాంపల్లి రాజేందర్ కు ముర్రా జాతి బర్రెలు‌, కన్నూర్ గ్రామానికి చెందిన కనకం రవీందర్ కు ట్రాక్టర్ ను దళిత బంధు పధకం కింద కొనుగోలు చేశారని తెలిపారు. కమలాపూర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఈ మండలాన్ని 12 క్లష్టర్ గా విభజించి,32 మంది తో బృందాలు ఏర్పాటు చేసి పారదర్శకంగా దళితబంధుసర్వే నిర్వహించామని అయన తెలిపారు. .దళిత బంధు పధకం కింద ఇప్పటి వరకు 3788 మందికి , ఒక్కో దళిత కుటుంబాని పదిలక్షల రూపాయల చొప్పున ఆన్లైన్ ఎకౌంట్లలలో నగదును జమ చేశామని అన్నారు..లబ్ధిదారులు కోరుకున్న యూనిట్ల ను మంజూరు చేస్తున్నామని అన్నారు.దళిత బంధు పధకం పై దళితులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు పథకం వర్తింప జేస్తామని కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అట్టి ప్రకటన లో వెల్లడించారు.

Share This Post