కమాన్ పూర్ మండలంలోని రొంపి కుంట గ్రామంలో పల్లె ప్రగతి పనులు పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి జూన్ 6:- పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కమాన్ పూర్ మండలంలోని రోంపికుంట గ్రామంలో కలెక్టర్ పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమాలను పర్యవేక్షించారు.

మన ఊరు మనబడి కార్యక్రమం కింద గ్రామంలో చేపట్టిన ఎంపీపీఎస్ పాఠశాల అభివృద్ధి పనులను జూన్ 28 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. బడిబాట కార్యక్రమం లో భాగంగా పాఠశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా ప్రణాళిక బద్ధంగా పని చేయాలని కలెక్టర్ సూచించారు.

గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ఏర్పాటుచేసిన నర్సరీని కలెక్టర్ పరిశీలించి నర్సరీ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 8వ విడత హరితహారం కార్యక్రమానికి అవసరమైన మొక్కులు సమకూర్చాలని అధికారులకు ఆదేశించారు.

గ్రామంలో డ్రైనేజీ నిర్వహణ మెరుగు పరిచవలసిన అవసరం ఉందని, పల్లె ప్రగతి లో భాగంగా మురికి కాలువలను వెంటనే శుభ్రం చేయాలని కలెక్టర్ ఆదేశించారు గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నీరు నిల్వ ఉండకుండా ప్రజలలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు నియంత్రించడానికి పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు.

గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతివనం పరిశీలించిన కలెక్టర్ మొక్కల సంరక్షణకు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. ప్రతి ఇంటి వద్ద తడి చెత్త పొడి చెత్త ను వేర్వేరుగా సేకరించే గ్రామంలో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్డు వినియోగించాలని కలెక్టర్ తెలిపారు.

గ్రామంలో నిర్మించిన స్మశాన వాటిక పరిశీలించిన కలెక్టర్, వైకుంఠధామం పరిసరాలలో, వైకుంఠదామానికి వచ్చే రహదారికి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

ఎం.ఆర్.ఓ.దత్తు ప్రసాద్,మండల పంచాయతీ అధికారి ఆరిఫ్ హుస్సేన్, గ్రామ సర్పంచ్ రవీందర్ సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post