కరీంనగర్ కళోత్సవాలు జీవితంలో అరుదైన ఘట్టంగా నిలుస్తుంది
అందరు ఆనందంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ ఆవిస్కృతమవుతుంది
తెలంగాణ బిడ్డగా పుట్టినందుకు గర్వపడుతున్నా
రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
0 0 0 0
శుక్రవారం నుండి కరీంనగర్ జిల్లాలో మొదలైన కరీంనగర్ కళోత్సవాలు జీవితంలో అరుదైన ఘట్టంగా నిలుస్తుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
శుక్రవారం కరీంనగర్ లోని డాః బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలో రాష్ట్ర బీసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సారద్యంలో అట్టహసంగా ప్రారభమైన కరీంనగర్ కళోత్సవాలు తన జీవితంలో అరుదైన అద్బుతమైన ఘట్టంగా నిలిచిపోతుందని రాష్ట్ర శాసనసభ స్వీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మొదటగా జ్యోతి ప్రజ్వల గావించి అనంతరం ఇజ్రాయిల్ బృందం, అస్సాం బృందం మరియు నాగదుర్గ మొదలగు కళకారుల నృత్య ప్రదర్శనలు ఇవ్వగా, అనంతరం సింగర్ మధుప్రియ పాటలను పాడారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ మాట్లాడుతూ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, కరీంనగర్ నడిబోడ్డున కళోత్సవాల పేరుతో దేశ విదేశాలకు చెందిన కళాకారులతో పాటు 20 రాష్ట్రాల, తెలంగాణ కు చెందిన కళాకారులకు ఒక్క వేదికపైకి తీసుకువచ్చిన 3రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహించనున్న కరీంనగర్ కళోత్సవాలు తెలంగాణాలోనే ఓ అద్బుతనమైన కార్యక్రమంగా చరిత్రలో నిలిచిపోనున్నదని అన్నారు. అందరు ఆనందంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ ఆవిషృతమవుతుందని, ఆ సంతోషం కోసం మనరాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అహర్నిషలు పాటుపడుతు ఎన్నో అభ్బుతమైన పథకాలకు ఆవిష్కరించారని పేర్కోన్నారు. తానేప్పడు కళలకు ప్రోత్సాహన్ని అందిస్తానని, కళలకు పుట్టినిల్లు అయిన తెలంగాణలో పుట్టినందుకు మనమందరం గర్వపడాలని అన్నారు.
రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, గతంలో ఆధ్యాత్మిక భావనను అందరిలో తలపించేలా శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సాలను నిర్వహించుకోవడం జరిగిందని, ఇప్పుడు కళాకారుల కోసం తెలంగాణతో పాటు దేశ విదేశాల మరియు రాష్ట్రాలకు చెందిన దాదాపు 150 మంది కళాకారులతో 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కళకు, కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకే కరీంనగర్ కాళోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రముఖ సిన నటులు శ్రీకాంత్ మాట్లాడుతూ, గతంలో బ్రహ్మోత్సవాలు 3 సంత్సరాల క్రింతం కరీంనగర్ కు రావడం జరిగిందని, తిరిగి ఇప్పడు కరీంనగర్ కళోత్సవాలకు హాజరయ్యానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టాలివుడ్ కు ఎంతో సహాకారాన్ని అందిస్తు కళాకారులకు ప్రోత్సహనందిస్తున్నారని తెలిపారు. త్వరలో కరీంనగర్ లో టాలివుడ్ చారిటి తరుపున క్రికెట్ మ్యాచ్ కూడా నిర్వహిస్తానని తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా హజరైన ప్రముఖసిని నటులు శ్రీకాంత్, తరుణ్ లను పోచారం శ్రీనివాస్ శాలువా, మెమోంటో తో సత్కరించుకోవడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్, సిపిలు పోచారం శ్రీనివాస్ ను సత్కించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్, మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్, చోప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్, ప్రముఖసీని నటులు తరుణ్, రోజారమణి, నగర మెయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, సిపి యం. సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్ లు, డిప్యూటి మెయర్ చల్ల స్వరూపా రాణి, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణరావు, ఎక్స్ ఎంఎల్ సి నారదాసు లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గోన్నారు.