కరీంనగర్ చేరుకున్న సీయం

కరీంనగర్ చేరుకున్న సీయం

 

కరీంనగర్ లో  మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూతురు వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు  హెలిక్యాప్టర్ ద్వారా కరీంనగర్ స్ప్రార్ట్స్ స్కూల్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి స్వాగతం పలికిన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖా మాత్యులు గంగుల కమలాకర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి

కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, ఐజి నాగిరెడ్డి, సిపి సత్యనారాయణ, చొప్పదండి శాసనసభ్యులు, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, చొప్పదండి శాసన సభ్యులు సుంకె రవిశంకర్.  అనంతరం అక్కడినుండి నేరుగా జిల్లా కేంద్రంలోని వి-కన్వెన్షన్ హల్లో జరుగుతున్న కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూతురి వివాహానికి హాజరై వేదమంత్రాల సాక్షిగా నూతన దంపుతులను ఆశీర్వదించారు.  అనంతరం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగులకమకర్ ఇంటికి చేరుకొని తేనేటి విందును స్వీకరించి జిల్లా ప్రగతిని గురించి చర్చించారు. అనంతరం అక్కడి తిరిగి వెళ్లిపోవడం జరిగింది.

Share This Post