కరీంనగర్ జిల్లాను వంద శాతం రోగరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
0 0 0 0
జిల్లాలో అనారోగ్యంతో బాధపడే వారికి మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చేపట్టవలసిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి జిల్లాను రోగరహిత కరీంనగర్ గా తీర్చిదిద్దాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్యాదికారులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అదికారులు మరియు సిబ్బందితో టిబి, మహిళలలో రక్తహీనత, సామ్-మామ్, పిల్లలో పోషకాహార లోపం తదితర అంశాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ టీబి కేసులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలలో ప్రత్యేక దృష్టిని సారించాలని, అవసరమై చోట ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. సబ్ సెంటర్ భవనాలను అభివృద్ది చేయాలని, పనుల్లో నిర్లక్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళల అరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ తీసుకోవాల్సిన ఆహారం, మందులను గురించి తెలియజేయడం వంటి వాటితో రూపొందించిన “హెల్త్ డైరీ” యాప్ ను ప్రతి మహిళకు చేరేలా డాక్టర్లు, ఆశా మరియు అంగన్ వాడి సూపర్ వైజర్లు ప్రత్యేక దృష్టిని సారించాలని తెలిపారు. మహిళలకు రక్తహీనత పరీక్షలను నిర్వహించిన అనంతరం ఏషీల్డ్ యాప్ లో వివరాలను నమోదు చేయడం జరుగుతుందని, ఆ వివరాలు మొత్తం హెల్త్ డైరీ లో కూడా చూసుకోవచ్చని, ఈ యాప్ ద్వారా మహిళ ఆరోగ్య పరిస్థితి, డాక్టర్ ను సంప్రదించడం, తీసుకోవాల్సిన మందుల గురించి రోజు వారికి తెలియజేయడంతో పాటు ఆరోగ్య విషయాలు, గర్బీణులు, రక్తహీనత గల మహిళలు తీసుకోవాల్సిన ఆహారం, పిల్లల సంరక్షణ, తల్లిపాలు మొదలగు అంశాలను గురించి క్లుప్తంగా వివరించేలా ఈయాప్ రూపొందించడం జరిగిందని, ఈ యాప్ అధికారులు, డాక్టర్లు, అంగన్ వాడి సిబ్బంది ప్రతి మహిళకు చేరేలా చూడడంతో పాటు యాప్ గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. సామ్-మామ్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిని సారించాలని, అశాలతో పాటు అంగన్ వాడి సూపర్ వైజర్లు ఇంటింటికి వెళ్లి పోషక లోప పిల్లలను పరిశీలించాలని, అంగన్ వాడి సూపర్ వైజర్లు కనీసం 25 మంది పిల్లలకు తగ్గకుండా వారి ఆరోగ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించి పోషకహారాలోపం ఉన్నవారిని ఎన్ ఆర్ సి (న్యూట్రిషియన్ రిహాబిటేషన్ సెంటర్) లకు తరలించాలన్నారు. పిల్లల తల్లులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, అవసరమైన చోట ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలకు అంగన్ వాడి కేంద్రాల ద్వారా బాలామృతం మొదలగు పోషకాహారాన్ని తప్పక అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంగన్ వాడి కేంద్రాలలో ఎత్తు, బరువును కొలిచేవి పరిశీలించాలని యంత్రాలు సరిగా పనిచేయకపోతే, దృష్టికి తీసుకువచ్చినట్లయితె కొత్తవి సరఫరా చేస్తానని తెలిపారు. అంగన్ వాడి కేంద్రాలలో సిబ్బంది అందుబాటులో ఉండాలని, వారికి కేంద్రాల ద్వారా అందించే సేవలపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూడాలని అన్నారు. ఆరోగ్య కేంద్రాలలో ఎ ఎన్ సి రిజిస్ట్ర్గేషన్ (గర్బీణిల నమోదు) సక్రమంగా జరగాలని, ఆరోగ్యకేంద్రాలలో ప్రతి శుక్రవారం పౌష్టికాహారాన్ని అందించాలని, సబ్ సెంటర్ లలో రిజిస్ట్రేషన్ తక్కువగా ఉన్నట్లయితే సంబంధిత అధికారులతో వారంలో ఒకరోజు సమీక్షించాలని సూచించారు. జనవరి 2023 నుండి ప్రారంభం కానున్న కంటివెలుగు కార్యక్రమానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని, కార్యక్రమం కొరకు జిల్లాలో గతంలో 28 బృందాలను ఏర్పాటు చేయగా ఈ సారి 48 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కోన్నారు. క్యాంపులు నిర్వహించడానికి అనువైన భవనాలను గుర్తించాలని, కంటిపరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు వేగవంతంగా పూర్తిచేయాలని, పరీక్షల అనంతరం అవసరమైన వారికి వెంటనే కళ్లద్దాలను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డెంగ్యూ పై అధికారలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాది సంక్రమించకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, తీవ్రత అధికంగా ఉన్నట్లయితె వెంటనే మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో పెద్దపాపయ్యపల్లిలో డెంగ్యూ కేసులు నమోదైనాయని, ప్రస్తుతం కేసులు తగ్గిపోయాయని తెలిపారు. సాదారణ ప్రసవాలపై అధికారులు దృష్టిసారించి ఆ దిశగా కృషి చేయాలని, హైరిస్క్ కేసులను ప్రదానాసుపత్రికి పంపించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాదికారి డా. జువేరియా, జిల్లా స్త్రీ శిశు సంక్షేమాధికారి సబిత కుమారి, ఉప వైద్యాదికారి డాః చందు, డిఐఓ సాజిదా, ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, సిడిపిఓలు, అంగన్ వాడి సూపర్ వైజర్లు పాల్గోన్నారు.