కరీంనగర్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అవార్డులు
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
00000
కరీంనగర్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అత్యుత్తమ సేవలు, రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్,రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అవార్డ్స్ ప్రధానం చేసినట్లు తెలిపారు.
కరీంనగర్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ ఆర్.వీ. కర్జన్ కు ఈ సేవా అవార్డు, ప్రశంసా పత్రము మరియు మెమోంటో ను రాష్ట్ర గవర్నర్ పంపించగా, బుధవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో కరీంనగర్ జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ ఆర్.వీ. కర్ణన్ గారి చేతులమీదుగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి కి అత్యుత్తమ సేవలు, అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు మరియు రక్తదానం చేసినందుకు గాను రెండు సిల్వర్ మోడల్స్ ను, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ మెంబర్ ఇంజనీర్ కోల అన్నారెడ్డి కి అత్యధిక సభ్యత్వాలు చేయించినందుకు సిల్వర్ మెడల్, కరీంనగర్ ఇండియన్ రెడ్ క్రాస్ కో-ఆర్డినేటర్ ఉట్కూరి యశ్వంత్ రెడ్డి కి అత్యుత్తమ సేవలు, అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకుగాను రెండు సిల్వర్ మెడల్స్ను ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాలు చేసినందుకుగాను జిల్లా కోశాధికారి శ్రీహరిరెడ్డి , బోడ సుధాకర్, ఎం.ఎల్.ఎన్ రెడ్డి లకు సిల్వర్ మెడల్స్ బుధవారం కలెక్టర్ వారికి అందించడం జరిగింది.