కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ లో స్థానిక సంస్థల MLC ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, , MLC ఎన్నికల జనరల్ అబ్జర్వర్ పి. విజయ్ కుమార్,

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిస్పక్షపాతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా జరిగాయి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్

కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
00000
7- కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ ను పోలింగ్ అధికారులు నిస్పక్షపాతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు.

7- కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ ప్రక్రియను, పోలింగ్ సరళిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ పరిశీలించారు. కరీంనగర్ జిల్లా పరిషత్ లో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. 7- కరీంనగర్ స్థానికసంస్థల నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ రిటర్నింగ్ అధికారి,కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ ముందుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కి స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ శశాంక్ గోయల్ జిల్లా ప్రజా పరిషత్ లోని పోలింగ్ కేంద్రాన్ని, పోలింగ్ సరళిని పరిశీలించారు.

ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. కోవిడ్-19 నిబంధనల ప్రకారం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఆరోగ్య శిబిరం, సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఓటర్ లందరికీ మాస్కులు, శానిటైజర్, ఓటు వినియోగించుకునేందుకు సింగిల్ చేతి తోడుగులను అందించారని, ధర్మల్ స్కానర్ తో టెంపరేచర్ చూశారని అన్నారు. పోలింగ్ అధికారులు పోలింగ్ ను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించారని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏర్పాటుచేసిన 8 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఎక్కడ నుంచి కూడా ఫిర్యాదులు అందలేదని తెలిపారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ వెంట 7- కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ, కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్ తదితరులు ఉన్నారు.

Share This Post