కరీంనగర్ పట్టణంలోని వావిలాల పల్లెలో డ్రై డే కార్యక్రమం ప్రారంభిస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పాల్గొన్న నగర్ మేయర్ వై సునీల్ రావు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

ప్రజలు డ్రై డే  పాటించేలా  100 బృందాలు ఏర్పాటు
బృందాలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తాయి
ప్రజలందరూ సహకరించాలి
విష జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు

ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదే
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
000000
కరీంనగర్ పట్టణంలో దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలు ప్రతి శుక్ర ,ఆదివారం డ్రై డే ను పాటించేలా అవగాహన కల్పించేందుకు 100 బృందాలను ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

శుక్రవారం కరీంనగర్ పట్టణంలోని వావిలాలపల్లె లో ఫ్రైడే పురస్కరించుకుని డ్రై డేను ప్రారంభించి ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని,ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. ఇంటి ముందు నీటి తొట్టిల్లో ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ బాధ్యత అన్నారు. విషజ్వరాల పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఇప్పటికే మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారన్నారు. విష జ్వరాలు ప్రబలిన తరువాత కాకుండా జ్వరాలు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలందరూ ప్రదీప్ శుక్ర ఆదివారాలను డ్రై డేలుగా పాటించాలని,ప్రజల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు. డెంగ్యూ దోమ మంచినీటిలోనే ఉంటుందని, ప్రజలు ఇంటిముందు ఉన్న ట్యాంకుల్లో నిలువ చేసుకున్న నీటిలో లార్వా ఉంటుందన్నారు. ప్రజలు తమ ఇంటి ముందు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ద్వారాలను అరికట్టవచ్చు అన్నారు. డ్రై డే ను విజయవంతం చేసేందుకు 5గురు సభ్యులతో గల 100 బృందాలను ఏర్పాటు చేశామని ఒక్కొక్క బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారని, బృందాలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తారని అవసరమైతే  నిలువ ఉన్న నీటిని తొలగిస్తారని ప్రజలందరూ సహకరించాలన్నారు. నగరంలో వైద్య బృందాలు సైతం జ్వర సర్వే నిర్వహిస్తున్నాయి విష జ్వరాల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు  కరీంనగర్ ప్రజలు విష జ్వరాలతో భయాందోళనకు గురికావలసిన అవసరం లేదని, విష జ్వరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లేట్ లేట్ మిషన్ అందుబాటులో ఉందని,ముందస్తు జాగ్రత్తగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేశామని తెలిపారు. జిల్లాలో మందుల కొరత లేదని,ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజలు రెండు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు,తదితరులు పాల్గొన్నారు

Share This Post