కరీంనగర్ పట్టణం సుందరీకరణ దిశగా చర్యలు

కరీంనగర్ పట్టణం సుందరీకరణ దిశగా చర్యలు

66.50 కోట్లతో కరీంనగర్ పట్టణంలో చెత్త నిర్మూలణ కార్యక్రమానికి శ్రీకారం

ఎడాదిలోగా కోతిరాంపూర్ డంపింగ్  యార్డులో ఉన్న 2 చెత్తను శుద్దిచేసి డంపింగ్ యార్డ్ ను మానేరు రివర్ ప్రంట్ లో కలుపుతాం.

పట్టణంలో ప్రతిరోజు వెలువడే 2 వేల మెట్రిక్ టన్నుల చెత్తను మరోచోటికి తరలింపు

రాష్ట్ర బీసి సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మాత్యులు గంగుల కమాలాకర్

0 0 0 0

కరీంనగర్ నగరాన్ని ఆధునీకరించి సుందరంగా  తీర్చిదిద్దేలా నగర సుందరీకరణ  పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని  రాష్ట్ర బీసి సంక్షేమ,  పౌరసరఫరాల శాఖ మాత్యులు గంగుల కమాలాకర్ అన్నారు.

                     మంగళవారం కరీంనగర్ నగరం లోని కోతిరాంపూర్ డంపింగ్ యార్డ్(బయో మైనింగ్) పనులను మంత్రి  ప్రారంభించారు.  ఈ సందర్బంగా  మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణం కోతిరాంపూర్ లో 1980-82  కాలంలో డంపింగ్ యార్డ్ కొరకు 9ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని,  ఈ డంపింగ్ యార్డ్ లో సుమారుగా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, నిత్యం కరీంనగర్ పట్టణంలోని ఇంటింటా సేకరించిన  చెత్తను  డంపింగ్ యార్డుకు తీసుకురావడం జరుగుతుందని, దీని ద్వారా వెలువడే కాలుష్యందుర్వాసన,  కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని గుర్తించి,  రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  పట్టణాలు ఆధునీకరించి, సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారని పేర్కోన్నారు.  ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు రాబోయో కాలంలో డంపింగ్ యార్డు కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డంపింగ్ యార్డును మరోచోటికి తరలించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కోన్నారు.   అందులో బాంగంగా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రణాళిక ప్రకారం రూ.16. 50 కోట్లతో చెత్త  తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని మంత్రి అన్నారు.  నిత్యం పట్టణంలో వెలువడే 2 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడకు తీసుకురాకుండా మరోచోటికి తరలించే పనుల కొరకు సుమారుగా 50 కోట్లు కేటాయించడం జరిగిందని మొత్తంగా సుమారుగా 66.50 కొట్లతో చెత్తనిర్మూలణ కార్యక్రమానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.  ప్రతిరోజు 1000 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్దిచేసే యంత్రాలను ప్రారంభించుకోవడం జరిగిందని,  త్వరలో మరో 1000 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్దిచేసే యంత్రాన్ని  తెప్పించడం జరుగుతుందని 2వేల మెట్రిక్ టన్నుల చెత్తను నిత్యం శుద్ది చేయడం జరుగుతుందని పేర్కోన్నారు.   వీటిద్వారా రాబోయో సంవత్సరంలో 9 ఎకరాలలోని 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిగా శుద్దిచేసి ఇట్టి స్థలాన్నిమానేరు రివర్ ఫ్రంట్  లో కలిపి ఆహ్లాదాకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరుగుంతుందని పేర్కోన్నారు.  దీనిపై ప్రతిరోజు పర్యవెక్షించి ఇంకా త్వరగా పూర్తిచేయడం జరుగుతుందని తెలిపారు.  డంప్ యార్డు తొలగింపుద్వారా కరీంనగర్ పట్టణం మరింత సుందరంగా   తయారువుతుందని తెలిపారు.

            బోయినపెల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ నుండి వెలువడే చెత్తను మానేరు తీరప్రాంతంలోని డంపింగ్ యార్డుకు తరలించడం ద్వారా సుమారుగా 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని,  ఈ చెత్త ప్రజల ఆరోగ్యానికి హానికరంగా భావించి,  డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను శుద్దిచేసి ఈ ప్రాంతాన్ని మానేరు రివర్ ఫ్రంట్ లో కలిపి ఆహ్లాదకరమైన వాతవరణాన్ని రూపొందించి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేలా కార్యక్రమానికి  రూపకల్పన చేయడం జరిగిందని తెలిపారు.  తెలంగాణలో 142 మున్సిపాలిటి, కార్పోరేషన్లు ఉన్నాయని సగం జనాబా పట్టణీకరణలో జీవిస్తూన్నారని,  నిత్యావర వస్తులు ఉపయోగపడే వాటిని నిలువ చేసుకొని పనికిరాని వాటిని రోజు చెత్తగా పడేస్తున్నారని, ఆ చెత్తను మున్సిపాలిటి వారు డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారని అన్నారు డంపింగ్ యార్డును  శుద్దిచేసి మానేరు రివర్ ఫ్రంట్ లో కలిపేలా చేపడుతున్న చర్యలు తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తాయని పేర్కోన్నారు.  ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడంతో పాటు, ఆచరణ సాద్యం చేసిన రాష్ట్ర బీసిసంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు ఈ సందర్బంగా కృతజ్ఞతలను తెలియజేశారు.

            ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జిలా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్,మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు, అధికారులు  తదితరులు పాల్గోన్నారు.

Share This Post