పిల్లలను ప్రోత్సహించండి
జిల్లా కలెక్టర్
పిల్లలను చదువుతో పాటు కళలో ప్రోత్సహిoచాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ కోరినారు.
బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో బాల భవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సృజనాత్మకతను వెలికి తీయడానికి జిల్లా బాలభవన్ కృషి చేస్తుందని తెలిపారు. పిల్లలను ప్రోత్సహించిన తల్లి తండ్రులను అభినందించారు. నృత్య సంగీత, వాయిద్యo,ఆర్ట్ క్రాఫ్ట్ లలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందని, ఈ సేవలను వినియోగించుకోవాలని కోరినారు