కరీంనగర్ లో ఆలయ ఫౌండేషన్ ద్వార దివ్యాంగుల ఉచిత కుత్రిమ కాళ్ల ను పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా)

దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్ల పంపిణి అభినందనీయం

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్
000000
దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లను పంపిణీ చేయడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు దివ్యాంగులకు మనోధైర్యాన్ని కలిగిస్తాయని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. శనివారం కరీంనగర్ ఆర్టిసి వర్క్ షాప్ సమీపంలో పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన ఆలయ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లను పంపిణీ చేసే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృత్రిమ కాళ్ల తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బసంత్ నగర్ కు చెందిన ఐ.ఏ.ఎస్. అధికారి పరికిపండ్లనరహరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆలయ ఫౌండేషన్ ద్వారా కృత్రిమ అవయవాలు ఉచితంగా అందించడం దివ్యాంగులకు గొప్ప వరమని అన్నారు. హైదరాబాద్ కు చెందిన భగవాన్ మహవీర్ వికలాంగుల సహాయ సమితి సహకారంతో ఉచితంగా జైపూర్ ఫుట్ టెక్నాలజీతో తయారు చేస్తున్న కృత్రిమ అవయవాలను దివ్యాంగులకు పంపిణీ చేశారు. మద్యప్రదేశ్ ప్రభుత్వ కమిషనర్ అండ్ కార్యదర్శి పరికిపండ్ల నరహరి ఐ.ఏ.ఎస్ తన తండ్రి సత్యనారాయణ సంస్మరనార్తం దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేయడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. దివ్యాంగుల కాళ్లు, చేతుల కొలతలను తీసుకుని ఇక్కడే కృత్రిమ అవయవాలను తయారు చేస్తున్న భగవాన్ మహవీర్ వికలాంగుల సహాయ సమితి నిర్వాహకులను, వైద్యులను, సాంకేతిక నిపుణులను కలెక్టర్ అభినందించారు.

 

Share This Post