కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్, ఎమ్మెల్యే క్వార్టర్ ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్, ఎమ్మెల్యే క్వార్టర్ ను ప్రారంభించిన

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

00000

 

     కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్, ఎమ్మెల్యే క్వార్టర్ ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు.

 

 

     మంగళవారం కరీంనగర్ పట్టణంలో 12.99 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ ను మరియు 4 కోట్ల తో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. అనంతరరం గెస్ట్ హౌజ్ లోని గదులను మంత్రి పరిశీలించారు.  జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ తో చర్చించారు.  అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులకు సంబంధించిన కరీంనగర్ జిల్లా పట్టణ ప్రగతి పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.

     ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, చోప్పదండి, మానకొండూర్, పెద్దపల్లి, జగిత్యాల మరియు రామగుండం ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్ రెడ్డి, డాక్టర్ ఎం సంజయ్, కోరు కంటి చందర్, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, సిపి సుబ్బారాయుడు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, నగర మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు,  ట్రైనీ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, జెడ్పి సీఈవో ప్రియాంక ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.

Share This Post