కరోనా కట్టడి వ్యాక్సిన్ తప్పనిసరి. వైద్య సిబ్బంది కి ప్రజలు సహకరించాలి. వ్యాక్సినేషన్ వేగం పెంచాలి. కరోనా కట్టడిలో స్థానిక ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకం. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ తప్పనిసరియని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో ప్రజలకు అందిస్తున్న వ్యాక్సినేషన్ తీరును ఆయన పరిశీలించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడో ముప్పు పొంచి ఉన్నందున  జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కరోనా నియంత్రణకు రెండు డోసులు  తప్పక తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. వ్యాక్సిన్ వలన ఎలాంటి అపోవలు వద్దని నూరు శాతం సురక్షితమని అన్నారు. జిల్లాలో నియమించిన ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు అన్ని కేంద్రాలను నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో 309 టీమ్స్ పనిచేస్తున్నామని వైద్య సిబ్బందికి ప్రజలు పూర్తిగా సహకరించాలని సూచించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు  రెండు కళాబృందాలచే పరిసరాల పరిశుభ్రత,  కరోనా నిబందనలపై పూర్తిగా అవగాహన కల్పిస్తున్నామని జిల్లాలో కరోనా కట్టడికి ప్రజా ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ వ్యాక్సిన్ గర్భిణీలు, బాలింతలు అలాగే ఇతర వ్యాధులతో ఉన్నవారు కూడా తప్పక తీసుకొని కరోనా నుండి సురక్షితంగా ఉండాలని అన్నారు. జిల్లాలో 141 వార్డులలో, 161 గ్రామీణ ప్రాంతాలలో వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారని మొత్తం 31 ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. సోమవారం  నాటికి మొదటి డోస్ 6,92,850 మందికి అలాగే రెండో డోస్ 4,31, 782 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని అలాగే ఈ నెల 31 వరకు మిగిలిన వారికూడా  వ్యాక్సినేషన్ పూర్తి  చేయాలని వైద్య సిబ్బందిని ఈ సందర్బంగా ఆదేశించారు. అనంతరం గ్రామం మొత్తం కలియ తిరిగి ప్రజల నుండి వ్యాక్సినేషన్ వివరాలను తెలుసుకున్నారు.
   ఈ కార్యక్రమంలో జెడ్.పి. సి.ఈ ఓ సురేష్, జడ్పీటీసీ జీడీ బిక్షం,mpo పరాంకుశం రావు, సర్పంచ్ రమేష్ నాయుడు, వైద్య, అంగన్వాడీసిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు.
కరోనా కట్టడి వ్యాక్సిన్ తప్పనిసరి.
వైద్య సిబ్బంది కి ప్రజలు సహకరించాలి.
వ్యాక్సినేషన్ వేగం పెంచాలి.
కరోనా కట్టడిలో స్థానిక ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకం.
జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

Share This Post