కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుండి రక్షణ పొందేందుకు జిల్లాలో ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారిని గుర్తించి వ్యాక్సిన్ ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుండి రక్షణ పొందేందుకు జిల్లాలో ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారిని గుర్తించి వ్యాక్సిన్ ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు.  మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, ఎంపిడివో లు, ఎంపిఓ లతో జిల్లాలో  ఒమిక్రాన్  రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల పై సమీక్షి నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మండలాల వారిగా ఇప్పటి వరకు జరిగిన మొదటి రెండవ డోస్ వ్యాక్సినేషన్ పై వివరాలు తెలుసుకున్నారు.  ఈ సందర్బంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోకుండా ఇంకా ఎవరైనా మిగిలిపోయాయి ఉంటే అలాంటి వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు.  అన్ని మున్సిపాలిటీలతో సహా అన్ని మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం వ్యాక్సిన్ పూర్ట్ కావాలని, రెండవ డోస్ మిగిలి ఉన్న వారు వారి షెడ్యూల్ వారిగా వ్యాక్సిన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  దీనికి తోడు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి మాత్రమే  బయటికి వెళ్ళేవిధంగా అవగాహన కల్పించాలన్నారు.  స్వీయ రక్షణ ఎంతో ముఖ్యమని మాస్క్ ధరించడం, శానిటైజేషన్ వాడటం వంటి ముందు జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు.  వైద్య ఆరోగ్య శాఖ తో పాటు పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి, జిల్లా వైద్య అధికారి రామనోహర్ రావు, మండల ప్రత్యేక అధికారులు, పి.హెచ్.సి మెడికిల్ ఆఫీసర్లు, ఎంపిడిఓ లు, ఎంపిఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post