ప్రచురణార్ధం
సెప్టెంబరు 17 ఖమ్మం:
కరోనా టీకా తీసుకునేందుకు భయపడాల్సిన అవసరం లేదని 18 సంవత్సరాలు పైబడిన వారందరూ నిర్భయంగా టీకా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పేర్కొన్నారు. జిల్లాలో జరుగుతున్న మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియను శుక్రవారం ముదిగొండ మండలంలో కలెక్టర్ తణిఖీ చేసారు. ముదిగొండ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ, వనంవారి కిష్టాపురం గ్రామంలో కలెక్టర్ ఇంటింటికి వెళ్ళి నివాసితులకు టీకా గురించి అవగాహన కల్పించి టీకా తీసుకునేందుకు స్వయంగా ప్రత్యేక శిభిరానికి ప్రజలను పంపించారు. కోవిడ్-19 టీకా తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావని, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ నిర్భయంగా కోవిడ్ టీకా తీసుకోవాలని కలెక్టర్ నివాసితులకు సూచించారు. వృద్ధులు, గర్భీణీలు, బాలింతలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు కూడా నిర్భయంగా టీకా తీసుకోవాలని కోవిడ్-19 టీకా తీసుకోవడం. వలన భవిష్యత్తులో కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోగల్గుతామని కలెక్టర్ ప్రజలకు వివరించారు. ముదిగొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో చిరుమర్రి, ముదిగొండ, ఎస్సీ, బి.సి. కాలనీలు, వెంకటాపురం, మేడేపల్లి మాధాపురం, ఎడవల్లి, పండ్రేగుపల్లి, ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్-19 టీకా వేయడానికి ప్రత్యేక శిభిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకనూ టీకా తీసుకొని వారు. తమ సమీప శిభిరానికి వెళ్ళి వెంటనే టీకా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యపర్చడం ద్వారా ప్రజలందరూ కోవిడ్ టీకా తీసుకోవాడానికి శిభిరానికి తరలి వెళ్ళారు. గ్రామాలలో ఎక్కువ మంది పొలంపనులకు వెళ్తారని వారందరి కొరకు ఉదయం 7.00. గంటల నుండే వ్యాక్సినేషన్ ప్రారంభించి సాయంత్రం 5.00 గంటల తర్వాత కూడా శిభిరాలను మరల కొనసాగించి అందరూ టీకా వేసుకునేలా తగు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముదిగొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వైద్యాధికారులు, మండల స్థాయి అధికారులతో కోవిడ్-19 టీకా మెగా క్యాంప్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. మండలంలోని పి.హెచ్.సి పరిధిలో 8 సబ్ సెంటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిభిరాల ద్వారా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మండలంలోని వనంవారి కిష్టాపురంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ తణిఖీ చేసారు. గ్రామంలో ఏ.ఎన్.ఎమ్. లలితా దేవి చురుకుగా పనిచేస్తూ మధ్యాహ్నం వరకు వంద మందికి పైగా టీకాలు వేయించినందుకు కలెక్టర్ ప్రశంసించారు. గ్రామంలో ఇంకనూ టీకా తీసుకోవాల్సిన 4 వందల మందికి కూడా టీకాలు వేయించి వందశాతం పురోగతి సాధించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా సర్వేలెన్స్ అధికారి డా॥రాజేష్, ముదిగొండ పి.హెచ్.సి డాక్టర్ అర్షియా, ఆయా గ్రామాల సర్పంచ్ లు లక్ష్మి, మాధవి, ఎం.పి.డి.ఓ శ్రీనివాసరావు, తహశీల్దారు టి. శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.