కరోనా టీకా వల్ల ఎటువంటి దుష్ప్రభావం కలుగదనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి 18 సంవత్సరాలు. పైబడిన వారందరూ తప్పనిసరిగా కరోనా టీకా తీసుకునే విధంగా ప్రజలను చైతన్యపర్చి జిల్లాలో కరోనా టీకా ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు, 16 ఖమ్మం:

కరోనా టీకా వల్ల ఎటువంటి దుష్ప్రభావం కలుగదనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి 18 సంవత్సరాలు. పైబడిన వారందరూ తప్పనిసరిగా కరోనా టీకా తీసుకునే విధంగా ప్రజలను చైతన్యపర్చి జిల్లాలో కరోనా టీకా ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొణిజర్ల గ్రామంలో గురువారం కలెక్టర్ తడిఖీ చేసారు. గ్రామంలో ఇంకనూ కోవిడ్-19 టీకా తీసుకొని వారి ఇంటింటికి వెళ్ళి నివాసితులను అవగాహన కల్పించి వారందరూ. టీకా తీసుకునే వరకు గ్రామంలోనే ఉండి గ్రామంలోని శ్రీరామ కళ్యాణమండపంలో ప్రత్యేక శిభిరం ఏర్పాటు. చేయించి ప్రజలు టీకా తీసుకునే విధంగా కలెక్టర్ ప్రజలను స్వయంగా చైతన్యపర్చారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి నివాసితులకు కోవిడ్-19 టీకా గురించి వివరించారు. ఎటువంటి జబ్బులు ఉన్నప్పటికీ కోవిడ్ టీకా తీసుకోవచ్చని టీకావల్ల ఎటువంటి దుష్ప్రభావం ఉండదని కలెక్టర్ వివరించారు. గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, షుగర్, బి.పి ఉన్నవారు కూడా కోవిడ్-19 టీకా తీసుకోవచ్చని అపోహలకు వెళ్ళి భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ ప్రజలకు భరోసా కల్పించారు. కలెక్టర్ సూచనలపై స్పందించిన ప్రజలు వెంటనే ప్రత్యేక శిఖిరానికి వచ్చి టీకాలు తీసుకున్నారు కరోనా బారీ నుండి ప్రజలను సురక్షితంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందని, తదనుగుణంగా గ్రామీణ, అర్బన్ ప్రాంతాలలో ప్రత్యేక సర్వే చేపట్టి ఇంకనూ వ్యాక్సినేషన్ తీసుకోని వారి వివరాలను సేకరిస్తూ వెనువెంటనే అటువంటి వారికి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ప్రత్యేక శిఖిరాలు ఏర్పాటు చేసామని 18 సంవత్సరాలు పైబడి ఇంకనూ కోవిడ్ టీకా తీసుకొని వారందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు.  ఈ సందర్భంగా కొణిజర్ల గ్రామంలో ఇప్పటికే చేపట్టిన సర్వే రికార్డులను కలెక్టర్ తణిఖీ చేసారు.  అనంతరం కొణిజర్ల మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి మండలంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కొరకు రూపొందించిన సూక్ష్మ ప్రణాళిక రికార్డులను తణిఖీ చేసారు. మండలంలోని కొణిజర్ల, పెద్దగోపతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంకనూ కోవిడ్ టీకా తీసుకొని వారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రస్థాయిలో ప్రతిరోజు రెండు వేలకు తగ్గకుండా టీకాలు ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇంటింటికి చేపడ్తున్న సర్వేద్వారా వ్యాక్సినేషన్ తీసుకున్న, ఇంకా తీసుకోవాల్సిన వారి వివరాలతో రూపొందించిన స్టిక్కర్లను ప్రతి ఇంటికి అంటించాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలని, తద్వారా ప్రజలు త్వరగా చైతన్యవంతులవుతారని కలెక్టర్ సూచించారు.

శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా॥అలీవేలు, జిల్లా సర్వేలెన్స్ అధికారి రాజేష్, మండల స్పెషల్ ఆఫీసర్ పరందామరెడ్డి, తహశీల్దారు కృష్ణ, ఎం.పి.డి.ఓ రమాదేవి. గ్రామ సర్పంచ్ రామారావు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం మెడికల్ ఆఫీసర్, ఏ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు..

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post