కరోనా థర్డ్ వేవ్ ప్రబలుతున్న నేపథ్యంలో కరోనా, ఒమిక్రాన్ వైరస్ ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి ఆదేశించారు .

కరోనా థర్డ్ వేవ్  ప్రబలుతున్న నేపథ్యంలో  కరోనా, ఒమిక్రాన్ వైరస్ ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి ఆదేశించారు .

 

గురువారం బోధన్ మండలం సాలూరు చెక్ పోస్టు వద్ద గల కరోనా పరీక్ష కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి వచ్చే ప్రతీ ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని సాలూర ఆసుపత్రి వైద్యురాలు రేఖను ఆదేశించారు. కరోనా, ఒమిక్రాన్ వైరస్ ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.  కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. 15 నుంచి 18 సంవత్స్రముల వయసు గలవారు ప్రతి ఒక్కరు తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు

 

ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య అధికారి సుదర్శన్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ గఫార్ మియా, సాలూర ఆసుపత్రి వైద్యురాలు రేఖ, బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్, సంబంధిత అధికారులు, తదితరులు  పాల్గొన్నారు

—————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి నిజామాబాదు జిల్లా గారిచే జారీ చేయనైనది

Share This Post