కరోనా నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు.

కరోనా నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు.

ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా వివిధ శాఖలు చేయాలిసిన పనుల పైన జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం కాన్ఫెరెన్స్ హాల్లో
జిల్లా కలెక్టర్ రివ్యూ ఏర్పాటు చేశారు..

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ..ఈసారి కుడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రూరల్ కలెక్టరేట్ ప్రాంగణం లోనే జరుగుతాయని ,ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండాలన్నారు.

వేదిక,ఇతర ఏర్పాట్లు చుడాలిసిందిగా Rdo మహేందర్, ఆర్ అండ్ బి ఈ ఈ కి, వేదిక పైన మైక్ సిస్టం, జిల్లా ప్రగతి కి సంబందించిన సందేశాన్ని తయారు చేయాలిసిందిగా DPRO పల్లవిని కలెక్టర్
ఆదేశించారు .

విధినిర్వహణ లో అత్యుత్తమ సేవలను అందించిన ఉద్యోగుల వివరాలను, ఒక్కో శాఖకి ఇద్దరు చొప్పున ఎంపిక చేసి త్వరగా నిర్దేశించిన ఫార్మాట్ లో కలెక్టరేట్ కి పంపించాలన్నారు..

శకటాల ప్రదర్శన , స్టాల్ ఏర్పాట్లు ఏమి ఉండవని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు అన్నీ శాఖల కార్యాలయ లలో జెండా ను ఎగురవేసి అనంతరం కలెక్టరేట్ లో జరిగే వేడుకలకు శాఖ అధిపతులు రావాలన్నారు .

సమావేశం అనంతరం..వేడుకలు జరిగే ప్రాంగణంలో ఎక్కడెక్కడ ఏమేమి చేయాలన్న దాని పైన సంబంధిత అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు .

కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా పోలేదని వేడుకలకు హాజరయ్యే అధికారులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించా లని తెలియజేసారు.

ఈ సమావేశం లో అడిషినల్ DCP వెంకట లక్ష్మి, అడిషినల్ కలెక్టర్ హరి సింగ్ , మామునూర్ acp భీమ్ రావు, Rdo మహేందర్, pd drdo సంపత్ రావు అన్నీ శాఖ లకు సంబందించిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Share This Post