కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వాక్సిన్ తీసుకోవాలని, జిల్లాలో నూటికి నూరు శాతం వ్యాక్సిన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్థం

భద్రాద్రి కొత్తగూడెం – సెప్టెంబర్ 16, 2021.

కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వాక్సిన్ తీసుకోవాలని,  జిల్లాలో నూటికి నూరు శాతం వ్యాక్సిన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.  గురువారం క్యాంపు కార్యాలయం నుండి 10 రోజులు పాటు నిర్వహించనున్న ప్రత్యేక వాక్సినేషన్  డ్రైవ్ కార్యక్రమంపై వైద్య పంచాయతీరాజ్, డిఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు,  యంపిడిఓలు, యంపిఓలతో టెలి  కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 18  సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. గ్రామ, మున్సిపల్ స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం పర్యవేక్షణకు వ్యాక్సినేషన్, సర్వేటీములను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణను ఏఎన్ఎం, అంగన్ వాడి ఉపాధ్యాయులు, ఐకెపి  సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రయ నిర్వహణకు ఏయన్ యం, అంగన్ వాడి టీచర్, బిల్ కలెక్టర్లు పర్యవేక్షణ చేయు విదంగా కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డోర్ టు డోర్ సర్వే నిర్వహణలో భాగంగా గ్రామీణస్థాయిలో ఏయయం, అంగన్‌వాడీ, అనేది సిబ్బంది, పట్టణ స్థాయిలో వాక్సిన్ ప్రక్రియకు  సర్వే టీములను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాక్సిన్ తో పాటు సర్వే ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతూ ఉండాలని చెప్పారు. వైద్య సిబ్బంది కొరత లేకుండా సర్దుబాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. డోర్ టు డోర్ సర్వేలో వాక్సిన్ తీసుకున్న కుటుంబ సభ్యుల వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలని చెప్పారు. వాక్సిన్ తీసుకున్న వ్యక్తుల గృహాలకు వ్యాక్సినేషన్ పూర్తయినట్లు గుర్తుగా స్టిక్కర్ అంటించాలని చెప్పారు. వ్యాక్సిన్ కొరకు ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామ, మున్సిపల్ స్థాయిల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన డీపీఓను, మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో 10 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియ నూటికి నూరు శాతం పూర్తి చేయాలని చెప్పారు.  వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాక్సిన్ ప్రక్రియపై పంచాయతీ వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పంచాయతీ, మున్సిపల్ సిబ్బందికి సూచించారు. వాక్సిన్ ఆన్లైన్ చేయుటకు ఇబ్బంది లేకుండా సిబ్బందికి శిక్షణ కల్పించాలని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరాయంగా జరిగేందుకు తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలని, వాక్సిన్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రం నందు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని, ప్రతి రోజు 100కు తక్కువ కాకుండా వాక్సిన్ జరగాలని చెప్పారు. ప్రజలు సమీపంలోని కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఎదురైతే కలెక్టరేట్ నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కొరకు కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము నెంబర్ 08744-241950 కు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియపై  వైద్యాధికారులు సమగ్ర నివేదికలు అందచేయాలని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మన జిల్లా ప్రధమస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రభుత్వ నిబంధనలు మేరకు అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన వివరించారు. వ్యాక్సినేషన్ మరియు విజయవంతంగా  జరిగేందుకు రోజువారి మైక్రో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ టెలికాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేర్వర్లు, వైద్యాధికారులు శిరీష, నాగేంద్రప్రసాద్, చేతన్, డిపిఓ రమాకాంత్,   డిఆర్డిఓ మధుసూదనరాజు,  మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు  తహసీల్దార్లు,  యంపిడిలు, యంపిఓలు,  తదితరులు పాల్గొన్నారు.

Share This Post