కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్న వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి

కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు. శనివారం ఉదయం గీసుకొండ మండలంలోని ధర్మారం, వంచనగిరి  గ్రామాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

ముందుగా ధర్మారం గ్రామంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ పక్రియను పరిశీలించారు. గ్రామాలలో ఇంకా వ్యాక్సినేషన్ వేసుకొని వాళ్ళు త్వరగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని, వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వస్తున్నారని కావున ప్రజలు త్వరగా వ్యాక్సినేషన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు, వైద్య సిబ్బంది వద్ద  ఇంకా వ్యాక్సిన్ వేయించుకోని వారి జాబితాను కలెక్టర్ పరిశీలించారు .

సిబ్బందికి పలు సూచనలు, సలహాలు తెలిపారు. అనంతరం వంచనగిరి లోని ఎస్సీ కాలనీలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ ఆశా వర్కర్లు ప్రతి ఇంటి తలుపుపై వేసిన స్టిక్కర్లను కలెక్టర్ పరిశీలించారు. గ్రామ ప్రజలతో కలెక్టర్ వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు .

ఇంకా కొంతమంది వ్యాక్సిన్ వేసుకోవడంలో కొంత అపోహలో ఉన్నారని అపోహను వీడి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్  చేయించుకుంటేనే కరోనా నుంచి రక్షణ పొందుతారని, అందరం  ఆరోగ్యవంతులుగా ఉండొచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ కే వెంకటరమణ, డాక్టర్ మాధవి లత, హెచ్ ఇ ఓ జమాల్, ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post