కరోనా నియంత్రణలో సంజీవినిగా ఉపయోగ పడే వాక్సినేషన్ ప్రక్రియ నూరు శాతం పూర్తి చేయుటలో ఆశా కార్యకర్తల సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 

బుధవారం  హెవీ వాటర్ ప్లాంట్ నందు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అశ్వపురం మండలంలో వాక్సిన్ ప్రక్రియ జరుగుతున్న విధానాన్ని ఆశా కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో నూరు శాతం వాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయుటలో ఇంటింటి సర్వే నిర్వహణ, అర్హులను గుర్తించుటలో మీరు అమూల్యమైన సేవలు అందిస్తున్నారని చెప్పారు. నూరు శాతం పూర్తి చేయుటకు అశ్వాపురం మండలం చాలా దగ్గరలో ఉన్నదని ఇదే సంకల్పం తో పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా మణికంఠ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post