కరోనా నుండి ప్రజలను కాపాడుకోవడానికి శుక్రవారం నుండి ఇంటింటికి ఆరోగ్యం పేరుతో నిర్వహించనున్న ఇంటింటి సర్వే కార్యక్రమంలో ప్రతి ఇల్లు కవరు కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. ఇంటింటికి ఆరోగ్యం, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ‘గురువారం కలెక్టరేట్ నుండి మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు, తహసిల్దారులు, యంపిఓలు, యంపిడిఓలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమ ప్రాధాన్యతపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని చెప్పారు. ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమాన్ని మండల, పట్టణ ప్రత్యేక అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని చెప్పారు. కరోనా పరీక్షలు నిర్వహణలో, వైద్య చికిత్సలు అందచేయుటలో వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అధైర్య బడకుండా జాగ్రత్తగా ఉండాలని, బయంకరమైన డెల్టా వేరియంట్లోనే బ్రహ్మాండమైన సేవలందించారని మిమ్మలను మీరు రక్షించుకుంటూ ప్రజలను కాపాడాలని చెప్పారు. ఇంటింటి సర్వే నిర్వహణకు ఏర్పాటు చేసిన మల్టీ పర్పస్ టీములు ప్రతి రోజు 35-40 ఇళ్లను కవరు చేయాలని, సర్వే కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాలని చెప్పారు. ఇంటింటి సర్వే నిర్వహణపై ప్రతి రోజు గ్రామ మున్సిపాల్టీల నుండి నివేదికలు అందచేయాలని చెప్పారు. కరోనా 2వ దశలో నిర్వహించిన ఇంటింటి సర్వే వల్ల వ్యాధి వ్యాప్తిని ఆపగలిగామని అదే తరహాలో ఇంటింటి సర్వే జరగాలని చెప్పారు. ఇంటింటి సర్వే వివరాలను రిజిష్టరులో నమోదులు చేయాలని, ప్రక్రియను కార్యదర్శులు పరిశీలన చేయాలని చెప్పారు. సర్వే చేసి వదిలేయడం కాదని పర్యవేక్షణ చాలా ముఖ్యమని చెప్పారు. లక్షణాలున్న వ్యక్తులకు హెూం ఐసోలేషన్ కిట్లు అందచేయాలని, ప్రతి ఇల్లు కవరు కావాలని, కోవిడ్ సోకిన వ్యక్తులు అధైర్యపడకుండా మందులు వినియోగం గురించి ధైర్యం కల్పించాలని చెప్పారు. ఇంటింటి సర్వే నిర్వహణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. వ్యాధి సోకకుండా ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, రద్దీ ప్రాంతాలకు వెళ్లొద్దని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఐసోలేషన్ కిట్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వ్యాధి సోకిన వ్యక్తులు మందులు వినియోగించాలో తెలియచేయు కరపత్రం అందచేయాలని చెప్పారు. ఐదు రోజులు క్రమం తప్పకుండా మందులు వాడినప్పటికీ వ్యాధి తగ్గకపోతే తక్షణమే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందచేయాలని చెప్పారు. బస్టర్ డోస్, 2వ డోస్, టీనేజర్ల డోస్ వేగవంతం చేయాలని, అనుకున్నంత వేగంగా జరగడం లేదని చెప్పారు. 15-17 వయస్కులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆదివారం వరకు పూర్తి చేయాలని చెప్పారు. మున్సిపల్ కమిషనర్లు, సర్పంచులు వార్డు వార్డులలో తనిఖీలు నిర్వహించి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయుటకు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున చేయాల్సి ఉన్నదని, కిట్లు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు. మణుగూరు కోవిడ్ కేంద్రంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. ఓమిక్రాన్ పేరుతో ప్రజలను మభ్య పెట్టి కాక్టాయిల్ ఇంజన్లు ఇవ్వొద్దని, ప్రజల నుండి అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ ఓపి సేవలు నిర్వహించాలని చెప్పారు. ఓమిక్రాన్ సోకిన వ్యక్తులు 7 రోజులు పటిష్టంగా ఐసోలేషన్ పాటిస్తే సరిపోతుందని చెప్పారు. వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతున్న ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులను కారణాలు అడిగి తెలుసుకుని వేగవంతం చేయాలని ఆదేశించారు. శాఖల వారిగా సిబ్బందికి బూస్టర్స్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని చెప్పారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్సులో అన్ని శాఖల జిల్లా అధికారులు, వైద్యాధికారులు, తహసిల్దారులు, యంపిడిఓలు, యంపిఓలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post