కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి, ప్రతి ఒక్కరు వాక్సిన్ వేసుకోవాలి.. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి.

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి, ప్రతి ఒక్కరు వాక్సిన్ వేసుకోవాలి.. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి.

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ కేంద్రంలో ఫాగింగ్ మిషన్ ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి,అడిషనల్ కలెక్టరు చంద్రయ్య ,స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలకు ప్రతి నెల నిధులు ఇస్తూన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.
నర్సరీలు , డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతి వనాలు నిర్మించి గ్రామాల రూపురేఖలు మార్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభత్వం అన్నారు.
గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు పడటంతో సీజనల్ వ్యాధులు తగ్గాయని తెలిపారు. తాండూరు నియోజకవర్గములో స్థానిక శాసన సభ్యులు ప్రత్యేక చొరవతో ప్రతి గ్రామానికి ఫాగింగ్ మిషన్ లు అందించటం అభినందనీయమని వీటిని పూర్తి స్థాయిలో వినియోగించి దోమల నివారణకు కృషి చేయాలన్నారు.
మునిసిపాలిటీలోని ప్రతి వార్డుకు ఒక ఫాగింగ్ మిషన్ ఉండేలా చూడాలని తెలిపారు. అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేసినారు.

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరు వాక్సిన్ వేసుకోవాలని వాక్సినేషన్ వందశాతం జరిగేలా ప్రజాప్రతినిధులు అందరూ చొరవ చూపాలన్నారు. తక్కువ వాక్సినేషన్ ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి పూర్తి స్థాయిలో వాక్సిన్ వేసుకునేలా చూడాలని సూచించారు. కోవిడ్ మొదటి,
రెండవ వేవ్ లో బాగా పని చేసిన ప్రజాప్రతినిధులకు,అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
వాక్సినేషన్ లో తెలంగాణ ముందుందని ఇప్పటికే రాష్ట్రంలో 4 కోట్ల డోసులు పూర్తి అయ్యాయని కేంద్రం సరాసరి కన్నా మన రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. రెండవ డోసు కూడా వేసుకొని కోవిడ్ ను
సమర్థవంతంగా ఎదుర్కోవటానికి అందరూ ముందుకు రావాలని మంత్రి కోరారు.

కేంద్రం రానున్న యాసంగిలో వరి ధాన్యం కొనబోమని ప్రకటించటంతో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రైతులను జాగృత పర్చాలన్నారు. కూరగాయలు ఇతర లాభసాటి పంటలు పండించేలా చైతన్య పర్చాలన్నారు.

Share This Post