కరోనా బాధితులకు ఆక్సీజన్ సేవలు అభినoదనీయం:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

కరోనా బాధితులకు ఆక్సీజన్ సేవలు అభినoదనీయం:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 9: కరోనా బాధితులకు రెడ్ క్రాస్ సంస్థ ఆక్సీజన్ సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా వచ్చిన తరువాత మర్యాద పూర్వకంగా జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు కలిసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ,
రెడ్ క్రాస్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆక్సిజన్ కాన్సంట్రేట్ సేవలు అభినందనీయం అన్నారు.
జనగామ జిల్లా రెడ్ క్రాస్ సేవల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డా. లవ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా బాధితులకు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వైద్యుల సూచన మేరకు ఆక్సిజన్ సేవలు అవసరమయిన వారికి ఇంటి దగ్గరే ఆక్సీజన్ సేవలు ఉపయోగించుకునేలా కాన్సంట్రేటర్లు రెడ్ క్రాస్ సంస్థ ఉచితంగా అందజేస్తుందని, అవసరం తీరిన తరువాత తిరిగి ఇవ్వాలని తెలిపారు. గతంలో రెడ్ క్రాస్ భవన నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణల ప్రయత్నం చేశామని కలెక్టర్ కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్, జనగామ జిల్లా రెడ్ క్రాస్ స్వంత భవన నిర్మాణం కోసం అందరం కలసి పనిచేస్తామని తెలిపారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కు రెడ్ క్రాస్ కార్యదర్శి కన్నా పరశురాములు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్
కోశాధికారి దేవా రాజ్, సభ్యులు గౌస్ మొయినోద్దీన్, డా. రాజమౌళి, పి. గోపయ్య, ఐఎంఏ జనగామ జిల్లా అధ్యక్షుడు డా. గోపాల్ రెడ్డి, ఎస్. హన్మంతరావు, అర్. ప్రకాశం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారీ చేయనైనది.

Share This Post