కరోనా మహామ్మారి గండం నుండి మానవాళిని గట్టెక్కించారని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు వైద్య, ప్రజా ప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అభినందించారు.

బుధవారం కొత్తగూడెం క్లబ్బులో వాక్సిన్ ప్రక్రియ, అంటువ్యాధుల నిర్మూలనపై ప్రజాప్రతినిధులకు, వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి నియంత్రణా చర్యల్లో భాగంగా ప్రాణాలను కూడా లెక్కచేయక వైద్య సిబ్బంది సేవలందించారని చెప్పారు. జిల్లాకు వైద్య, నర్సింగ్ కళాశాలలు మంజూరు వల్ల ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కరోనా, డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల నియంత్రణలో ప్రజా ప్రతినిధులు, పంచాయతీ, మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది సేవలు అభినంద

నీయమన్నారు. వ్యాధి ప్రబలుతున్నా మొక్కవోని ధైర్యంతో పరిసరాలను పరిశుభ్రం చేసి ప్రజలను కాపాడారని వారి సేవలను కొనియాడారు. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం ఎక్కడికక్కడ మొబైల్ పరీక్షలు నిర్వహిస్తూ మెడికల్ కిట్లు పంపిణీ చేశామని, తద్వారా వ్యాధిని తగ్గించగలిగామని చెప్పారు.

జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మన జిల్లాకు చాలా చాలెంజెస్ ఉన్నాయని, మారుమూల గ్రామాలతో పాటు నిరక్ష్యరాస్యత ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో వెనుకడుగు వేయక వైద్య సిబ్బంది వ్యాక్సిన్ అందిస్తున్నారని, వ్యాన్సినేషన్ ప్రక్రియలో ప్రజా ప్రతినిధులు, అధికారుల పాత్ర ఎంతో ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖ నుండి మన జిల్లాకు సమృద్ధిగా వ్యాక్సిన్ సరఫరా జరుగుతున్నదని, ప్రజలు వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు వీడి తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. జనవరి 16, 2021 జిల్లా ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి 3.96 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని, సెప్టెంబర్ 16, 2021వ తేదీ నుండి చేపట్టామని ఈ 25 రోజుల వ్యవధిలో 3 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా గణనీయమైన వేగవంతంగా వ్యాక్సిన్ నిర్వహిస్తున్నామని,  ఇదే స్పూర్తితో అక్టోబర్ 31వ తేదీ నాటికి మన జిల్లాను నూరు శాతం వ్యాక్సినేషన్ చేసిన జిల్లాగా ప్రకటించు విధంగా లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామని చెప్పారు. వ్యాక్సిన్ ప్రక్రియలో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నదని, అద్భుతమైన ప్రగతి సాధించారని, ప్రజలందరు మమేకమైన నూరు శాతం వ్యాక్సిన్ కావాలన్న సకల్పాన్ని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ తక్కువగా జరుగుతున్నదని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు 20 మొబైల్ వాక్సినేషన్ సంచార వాహనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెండు వార్డులకు ఒక మైబైల్ వాహనం ద్వారా వ్యాక్సిన్ జరుగుతుందని చెప్పారు. వ్యాధుల నియంత్రణలో అన్ని శాఖల సమన్వయంతో మంచి ప్రగతిని సాధించామని | గ్రామస్థాయి నుండి మున్సిపల్ స్థాయి వరకు ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, మీడియా సేవలు అభినందనీయమని చెప్పారు. రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా మహామ్మారి కనుమరుగు కాలేదని, మానవాళికి ప్రమాదం పొంచి ఉన్నదని, వ్యాధి సమూల నిర్మూలన కావాలంటే తప్పని సరిగా అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొవడానికి వ్యాక్సినే ఆయుధమని చెప్పారు. దాదాపు రెండు సంవత్సరాల కాలం నుండి మానవాళి మనుగడ ప్రశ్నార్ధకం చేసిన కరోనా వ్యాధి నిర్మూలనకు తక్కువ సమయంలో వాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడం చాలా సంతోషమని చెప్పారు. వందశాతం వ్యాక్సిన్ జరిగితే తప్ప వ్యాధి నుండి పూర్తి రక్షణ ఉండదని, వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉంటుందని, వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉండదని చెప్పారు. వైరస్ నుండి పూర్తిగా బయటపడాలంటే తప్పనిసరిగా అపోహలు వీడి నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వ్యాధి నియంత్రణ చర్యల్లో ప్రజలందరూ

 

 

బంధాలు, అనుబంధాలను కూడా దూరం చేసుకున్నారని ఆయన చెప్పారు. వ్యాధి సోకిన వ్యక్తులను ఆసుపత్రుల్లో చూడలేక అనుక్షణం ప్రజలు మానసిక క్షోభను అనుభవించారని చెప్పారు. గత ఫిబ్రవరి మాసం నుండి వ్యాధితో పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పారు. కోవిడ్ ప్రతి ఒక్కరి సమస్యగా భావించా గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి. వరకు కట్టడి చేయడంలో ప్రజల సహకారం మరువలేనిదని చెప్పారు. ఎక్కడికక్కడ మా గ్రామాలకు రావొద్దని ప్రజలు స్వీయ నియంత్రణ పాటించారని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న మానవాళిని రక్షించేందుకు వైద్య సిబ్బంది ఊరు ఊరు, పల్లె పల్లె తిరిగి వ్యాక్సిన్ వేస్తున్నారని అభినందించారు. 70 శాతం మంది ప్రజలకు వ్యాధి లక్షణాలు కనిపించుట లేదని చెప్పారు. సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నట్లు చెప్పారు. 2-18 సంవత్సరాలున్న వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రాష్ట్రంలో 1.20 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ఇచ్చు విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామ, మున్సిపల్ స్థాయిల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియపై తీర్మానాలు చేయాలని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాధి నుండి బయటపడలేక పోతున్నారని ప్రభుత్వం తీసుకున్న చర్యలు వల్ల మనం వ్యాధి నుండి బయటపడేందుకు అతి దగ్గరలో ఉన్నామని చెప్పారు. భద్రాద్రి జిల్లాను కరోనా, డెంగీ, మలేరియా రహిత జిల్లాగా ప్రకటించుటకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మనందరం కల్సికట్టుగా పనిచేసినపుడే ప్రజలను వ్యాధుల నుండి రక్షించగలమని చెప్పారు. వైద్య కళాశాల ఏర్పాటు వల్ల మన జిల్లాకు సూపర్ స్పెషాలిటి సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. వైద్య విద్యను అభ్యసించాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లి చదివే పరిస్థితి నుండి నేడు మనం ఉన్న ప్రాంతానికే కళాశాల మంజూరు చేయడం సంతోషమని చెప్పారు. సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయడంతో మీడియా సేవలు అభినందనీయమని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రజా ప్రతినిధులే ప్రజలకు దేవుళ్లని చెప్పారు. రానున్న జరవరి మాసంలో మన జిల్లాను కరోనా రహిత జిల్లాగా ప్రకటించుటకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ముక్కంటేశ్వరావు, డిపిఓ రమాకాంత్, జడ్పీ వైస్పర్మన్ కె. చంద్రశేఖర్రావు, మున్సిపల్ చైర్మన్ సీతాలక్ష్మి, సర్పంచులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post